100 కోట్ల కోసం రంగంలోకి దిగాడు

100 కోట్ల కోసం రంగంలోకి దిగాడు

మహేష్ బాబు సహజంగా మీడియాతో ఎక్కువగా కలవడు. సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా కనిపించడు. అతి తక్కువగా మాట్లాడుతూ.. ఆ కాసింత మాటల్లోనే బోలెడంత మీనింగ్ వచ్చేలా జాగ్రత్త పడడం సూపర్ స్టార్ స్పెషాలిటీ. అందుకే మహేష్ బాగా జోవియల్ అని.. తెగ జోకులు వేస్తాడని పలువురు హీరోయిన్స్ చెబుతుంటే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది.

అయితే.. మూవీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం మహేష్ బాగా అలర్ట్. అసలు ప్రచారానికి ఉన్న ఇంపార్టెన్స్ ను మొదటగా తెలుసుకున్న స్టార్ హీరో మహేష్ బాబే. తన ప్రతీ చిత్రానికి అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఇప్పుడు భరత్ అనే నేను చిత్రానికి కూడా విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు. రిలీజ్ కి ముందు మాత్రమే  కాక ఇప్పటికీ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఎన్నడూ కనిపించనంత యాక్టివ్ గా భరత్ అనే నేను చిత్రాన్ని మహేష్ ప్రమోట్ చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇవాల్టి రోజుల్లో సినిమా రిలీజ్ అయి వారం అయిందంటే.. ఇక ఆ మూవీ రన్ దాదాపుగా పూర్తయిందని అంతా భావిస్తారు. కానీ మహేష్ మాత్రం ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు. తెగ అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు.

విడుదలకు ముందు మీడియాతో స్పెషల్ మీటింగులు.. కొందరికి బహుమతుల నుంచి.. ఇప్పుడు కేటీఆర్ తో ఓ ప్రెస్ మీట్లో పాల్గనడం.. హ్యాండ్ లూమ్స్ ని ఇకపై కూడా ధరిస్తానని చెప్పడం వంటివి తన సినిమా ప్రమోషన్ లో భాగంగానే కుమ్మేస్తున్నాడు. విజయవాడ వెళ్లడం.. అన్నపూర్ణ ధియేటర్లో సినిమా చూడటం.. అసలు మహేష్‌ ఈ మద్యన ధియేటర్ విజిట్స్ ఎప్పుడూ చేయలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం తిరుపతి అండ్ వైజాగ్ లో కూడా అదే పని చేస్తాడట. తన సినిమాపై ఎంత  పాజిటివ్ బజ్ ఉన్నా.. డివైడ్ టాక్ కూడా ఉంటూనే ఉంది. దీన్ని ఓవర్ కమ్ చేయడం కోసం మహేష్ బాగానే కష్టపడుతున్నాడు. మరి 100 కోట్లు షేర్ తేవాలంటే కష్టపడక తప్పదు. అందుకే మహేష్‌ ఈ తరహాలో రంగంలోకి దిగాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు