టుస్సాడ్స్‌లో మహేష్.. ఇలాంటి గొడవలు కూడానా?

టుస్సాడ్స్‌లో మహేష్.. ఇలాంటి గొడవలు కూడానా?

మహేష్ బాబు విగ్రహాన్ని బ్యాంకాక్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో పెడుతున్నారన్న వార్త అందరికీ అమితానందాన్నిచ్చింది. ఇది తెలుగు సినీ పరిశ్రమ గర్వించాల్సిన విషయమే. దక్షిణాది తారల్లో ఈ గౌరవం దక్కించుకున్న రెండో వాడు మహేష్ బాబు. ఐతే ఈ విషయం మీద ఆల్రెడీ రగడ మొదలైపోయింది.

మా ప్రభాస్‌కు ఏడాది కిందటే విగ్రహం పెట్టారు.. మీ మహేష్ బాబుకు ఇప్పుడు పెడుతున్నారంటూ యంగ్ రెబల్ స్టార్ అభిమానులు కవ్వించే ప్రయత్నం చేస్తే.. వాళ్లు మరో రకంగా కౌంటర్ వేశారు. ఇంతకముందు విగ్రహం పెట్టింది ‘బాహుబలి’ అనే పాత్రకు అని.. ప్రభాస్ కు కాదని.. తెలుగులో ఒక హీరోకు టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం పెట్టడం ఇదే తొలిసారని పంచ్ వేశారు.

ఐతే ఒక మంచి పరిణామం జరిగినపుడు దీన్ని ఇండస్ట్రీ మొత్తానికి దక్కిన గౌరవంగా భావించి సంతోషించాల్సింది పోయి.. ఇలా వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడమే విడ్డూరం. వేరే ఇండస్ట్రీల్లో ఇంకా పెద్ద స్టార్లున్నారు. లెజెండ్స్ ఉన్నారు. వాళ్లను కాదని మన పరిశ్రమకు చెందిన ఇద్దరు హీరోలకు మాత్రమే ఈ గౌరవం దక్కితే ఇలాగేనా ప్రవర్తించేది. తాము తాము బాగానే ఉంటామని.. మీరు మారండని కొన్ని రోజుల కిందటే మహేష్ బాబు స్వయంగా అభిమానుల్ని హెచ్చరించాడు.

కానీ తాము మారబోమని.. ఇలాగే ఉంటామని ఫ్యాన్స్ చాటిచెప్పినట్లయింది. ఇలా అవతలి హీరోల గాలి తీస్తూ.. తమ హీరోనే గొప్ప అని పొంగిపోయే సంస్కృతి ఎప్పటికి మారుతుందో? ఇంతకుముందు తమిళ అభిమానులే ఇలా ఉండేవారు. కానీ రోజు రోజుకూ మన ఫ్యాన్స్ కూడా ఇలాగే తయారవుతుండటం విచారకరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు