మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు

మహేష్ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు

దర్శకుడిగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ. ఈ ప్రాజెక్టు గురించి సందీప్ కంటే ముందు మహేషే ప్రకటన చేయడం విశేషం. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ.. సందీప్‌తో ఓ సినిమా ఉంటుందని మహేష్ స్పష్టం చేశాడు. ఐతే అది ఎప్పుడనే విషయంలో క్లారిటీ లేదు. దీనిపై ఇప్పుడు సందీప్ స్పందించాడు. మహేష్ సంగతేమో కానీ.. తన మూడో సినిమాగా మహేష్ బాబు ప్రాజెక్టే ఉంటుందని అతను స్పష్టం చేశాడు. సందీప్ ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్‌ను మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ చిత్రం జులైలో సెట్స్ మీదికి వెళ్తుందని సందీప్ ప్రకటించాడు. ఆరు నెలల్లో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో దీన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నారట.

ఆ సినిమా పని పూర్తవ్వగానే మహేష్ ప్రాజెక్టు మీదికి వెళ్లిపోతానని సందీప్ చెప్పాడు. కొన్ని రోజల కిందటే మహేష్‌ను కలిశానని.. తమ మధ్య చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని.. కొన్ని ఐడియాలు డిస్కస్ చేశామని సందీప్ తెలిపాడు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ అయ్యాక తాను పూర్తి స్క్రిప్టును డెవపల్ చేస్తానని అతనన్నాడు. మహేష్ మరికొన్ని రోజుల్లోనే వంశీ పైడిపల్లి సినిమాను మొదులపెట్టబోతున్నాడు. దాని తర్వాత సుకుమార్ సినిమాను అనౌన్స్ చేసినప్పటికీ.. ఆ సమయానికి సుక్కు స్క్రిప్టు రెడీ చేస్తాడా అన్నది డౌటు. ఒకవేళ సందీప్ స్క్రిప్టుతో రెడీగా ఉంటే దీన్నే ముందు లాగించేయొచ్చేమో. సుక్కు సినిమానే ముందు పట్టాలెక్కితే సందీప్ కొంత కాలం ఖాళీగా ఉండాల్సిందే. ఎటు తిరిగీ వచ్చే ఏడాదే మహేష్-సందీప్ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు