మంచు ఫ్యామిలీకి రిలీఫ్ దక్కుతుందా?

మంచు ఫ్యామిలీకి రిలీఫ్ దక్కుతుందా?

మంచు ఫ్యామిలీ అంటే ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నారు. గత ఏడాది వ్యవధిలో ఆ ఫ్యామిలీ నటీనటులకు దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. మంచు విష్ణు సినిమా ‘లక్కున్నోడు’ వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. మంచు మనోజ్ చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’ కూడా దారుణమైన ఫలితాన్నందుకుంది. మంచు లక్ష్మీప్రసన్న సినిమా ‘లక్ష్మీబాంబు’ గురించి అసలు డిస్కషనే లేకపోయింది. ఇక చివరగా మోహన్ బాబు-విష్ణు కలిసి చేసిన ‘గాయత్రి’ కూడా ఆ ఫ్యామిలీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఇక విష్ణు సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ అయినా మంచు కుటుంబానికి ఆనందాన్ని మిగిలుస్తుందేమో అని ఆశగా చూస్తున్నారు.

జనవరిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ముందు ఈ చిత్రంపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి కానీ.. వాయిదాల వల్ల బజ్ పోయింది. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ లాంటి భారీ సినిమా థియేటర్లలో ఉండగా.. ఇది రిలీజవుతోంది. దీనికి పోటీగా నాగశౌర్య-సాయిపల్లవిల ‘కణం’ కూడా విడుదలవుతోంది. విష్ణు-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలూ విజయవంతమైన నేపథ్యంలో ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా సక్సెస్ అవుతుందనే ఆశాభావంతో ఉంది చిత్ర బృందం. ఈ చిత్రం కామెడీ ప్రధానంగా నడిచేలా కనిపిస్తోంది. కామెడీ వర్కవుటైతే సినిమా ఆడేసే అవకాశముంది. కానీ విష్ణు-బ్రహ్మి కామెడీ ఒకప్పటిలా పేలుతుందా అన్నది డౌటు. చూద్దాం మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు