బాహుబ‌లిని చూసి భారీ సెట్లేస్తున్నారు

బాహుబ‌లిని చూసి భారీ సెట్లేస్తున్నారు

బాహుబ‌లి సినిమా బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల అహంపై బాగానే దెబ్బ‌కొట్టింది. దేశంలో తాము మాత్రం అత్యుత్త‌మ అద్భుత సినిమాలు తీయ‌గ‌ల‌మ‌న్న అతి న‌మ్మ‌కంతో ఉంది బాలీవుడ్‌. అలాంటి వారు తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన బాహుబ‌లి సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఆ సినిమాను మించిపోయే సినిమా తీయాల‌న్న కాంక్ష‌తో ర‌గిలిపోతున్నారు. అందుకు ఇప్ప‌టికే బోలెడు ప్రాజెక్టులు ప్ర‌క‌టించారు కూడా. బాహుబ‌లిలో సెట్టింగ్‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని అద్భుతాలే. సినిమా విజ‌యంలో వాటి పాత్రే ఎక్కువ‌ని న‌మ్మేవారు ఉన్నారు. అందుకే ఇప్పుడు బాలీవుడ్ ద‌ర్శ‌కులు సైతం భారీ సెట్టింగుల‌పై దృష్టి పెడుతున్నారు.

క‌ర‌ణ్ జోహార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న సినిమా క‌ళంక్. వ‌రుణ్ ధావ‌న్ అలియా భ‌ట్ మాధురీ దీక్షిత్ సంజ‌య్ దత్ సోనాక్షి సిన్హా వంటి పెద్ద‌తార‌లు న‌టిస్తున్న సినిమా. 1940ల నాటి క‌థ‌తో దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ఇందుకోసం మ‌హ‌ల్‌ను త‌ల‌పించే అతి భారీ సెట్‌ను వేశారు. అది కూడా చాలా సీక్రెట్‌గా. ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఈ భారీ సెట్ వేసిన‌ట్టు స‌మాచారం. అందులో ప‌లు కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ సెట్ వేసేందుకు దాదాపు  ప‌దిహేను కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుపెట్టార‌ట‌. బాహుబ‌లిని చూసే సెట్‌ల‌కు భారీగా ఖ‌ర్చుపెట్ట‌డం మొద‌లుపెట్టారంతా. ఇంకా చెప్పాలంటే బాహుబ‌లిని మించేలా సెట్‌లు ఉండాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు.

క‌ళంక్ సినిమా సెట్టింగ్‌ను అమ్రితా మ‌హ‌ల్ అనే ఆర్ట్ డైరెక్ట‌ర్ నిర్మించారు. ఈమె గ‌తంలో అనేక బాలీవుడ్ సినిమాల‌కు ప‌నిచేసింది. క‌ళంక్ సినిమాతో మంచి పీరియాడిక్ చిత్రం తీశార‌న్న ఘ‌న‌త‌ను కొట్ట‌డంతో పాటూ బాహుబ‌లిని అంద‌రూ మ‌ర్చిపోయేలా చేయాల‌ని ఆరాట‌ప‌డుతున్నాడు క‌ర‌ణ్‌. అత‌ని తండ్రి య‌ష్ జోహార్ కూడా సినిమాను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నారు. ఇప్ప‌టికే వ‌రుణ్ అలియాల‌పై ప‌లు సీన్లు చిత్రీక‌రించారు. త్వ‌ర‌లో మిగ‌తా న‌టీన‌టులంతా కూడా సెట్‌కు చేరుకుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు