చెర్రీ-తార‌క్.. పెద్ద హీరోలు అనిపించుకోండే

చెర్రీ-తార‌క్..  పెద్ద హీరోలు అనిపించుకోండే

సినీ ఇండ‌స్ట్రీలో హీరోలు హీరోయిన్లు ద‌ర్శ‌కుల రెమ్యున‌రేష‌న్లు అధికంగా ఉంటాయ్ క‌నుక వారెప్పుడూ స్టైక్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ లైట్ మెన్లు జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ల ప‌రిస్థితి వేరు. చాలా త‌క్కువ వేత‌నంతో స‌ర్దుకుపోవాల్సిన స్థితి. సినిమా సినిమాకు హీరో హీరోయిన్లు రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ పోతారు కానీ వీరికి మాత్రం అలాంటి అదృష్టం లేదు. అందుకే జీతాలు పెంచాలంటూ ధ‌ర్నా చేస్తున్నారు. వారి ధ‌ర్నాతో అన్ని సినిమా షూటింగ్‌ల‌కు బ్రేక్ వ‌చ్చింది కానీ రామ్ చ‌ర‌ణ్ - తార‌క్ సినిమాల షూటింగ్ మాత్రం జ‌రిగిపోతోంది.

లైట్ల‌మెన్ల‌కు ఒక యూనియ‌న్ ఉంది. ఆ యూనియ‌న్ ద్వారానే సినిమా షూటింగ్‌ల‌కు లైట్‌మెన్లు స‌ర‌ఫ‌రా చేస్తారు. వారి వేత‌నాలు పెంచ‌డంతో పాటూ అర‌పూట కాల్ షీట్ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ వారు గత కొన్ని రోజులుగా ధ‌ర్నా చేస్తున్నారు. త‌మ డిమాండ్లు తీర్చే వ‌ర‌కు లైట్ మెన్లు ఎవ‌రూ ప‌నిలోకి రార‌ని ఒక‌వేళ ఎవ‌రినైనా ముంబై నుంచి తెప్పించుకుంటే ఆ సినిమా షూటింగ్‌ల‌ను అడ్డుకుంటామ‌ని యూనియ‌న్ ముందే ప్ర‌క‌టించింది. చివ‌రికి ఛండీ ఘ‌డ్‌లో జ‌రుగుతున్న నితిన్ సినిమా షూటింగ్ కూడా ఇదే కార‌ణంగా ఆగిపోయింది. యూనియ‌న్ త‌మ లైట్ మెన్‌ను అక్క‌డ్నించి వెన‌క్కి ర‌ప్పించారు. ఇంత జ‌రుగుతున్నా సినిమా పెద్ద‌లెవ‌రూ ఇందులో క‌ల‌గ‌జేసుకోలేదు. ప‌వ‌న్ స‌మ‌స్యొస్తే బ‌య‌ట‌కు వ‌చ్చిన సినీ పెద్ద‌లు వంద‌లమంది బతుకుల‌కు సంబంధించిన విష‌యంపై మాత్రం ఏమీ మాట్లాడ‌డం లేదు.

అన్ని షూటింగ్‌లు ఆగినా రామోజీ ఫిల్మ్ సిటీలో జూనియ‌ర్ ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్‌లు మాత్రం ఆగ‌కుండా జ‌రిగిపోతున్నాయ్‌. వారు ముంబై నుంచ లైట్ మెన్ ను తెప్పించుకుని మ‌రీ షూటింగ్ కానిస్తున్నారట. బ‌య‌ట వాళ్లెవ‌రూ ఫిల్మ్ సిటీలోకి వెళ్లే ఛాన్సు లేదు కాబ‌ట్టి యూనియ‌న్‌వాళ్లు ఆ సినిమా షూటింగ్‌ల‌ను అడ్డుకోలేక‌పోతున్నారు. త‌న బాబాయ్‌కి క‌ష్ట‌మొస్తే తెగ బాధ‌ప‌డిపోయిన రామ్ చ‌ర‌ణ్ లైట్ మెన్ల వేత‌నాల విష‌యాల‌ను మాత్రం లైట్‌గా తీసుకున్న‌ట్టున్నాడు.  ఇలా త‌మ‌కు సంబంధం లేన‌ట్టు షూటింగ్ చేసుకోకుండా... స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప‌ని చేస్తే తార‌క్ చెర్రీలు నిజంగానే పెద్ద హీరోలు అనిపించుకుంటారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు