బికినీలు వేసినందుకే సినిమాల‌ క్యూ?

బికినీలు వేసినందుకే  సినిమాల‌ క్యూ?

ఒక లైలా కోసం  సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది పూజా హెగ్డే. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్‌. ఆమె న‌ట‌న‌, అందం కూడా పెద్ద‌గా ఎవ‌రినీ ఆక‌ట్టుకోలేదు. త‌రువాత వెంట‌నే ముకుంద సినిమా ఆ సినిమా ప‌రిస్థితి అంతే. త‌రువాత మూడేళ్లు తెలుగులో సినిమా అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంది. దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమా రూపంలో అదృష్టం క‌ల‌సివ‌చ్చింది. ఇక అమ్మ‌డు వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా స్టార్ హీరోయిన్ రేసులో ముందుంది.

స‌న్న‌గా పుల్ల‌లా ఉంటుంది. పోనీ న‌ట‌న అద‌ర‌గొడుతుందా అంటే ఇంత‌వ‌ర‌కు ఆమెకు న‌టించే అవ‌కాశం ఉన్న పాత్రే ద‌క్క‌లేదు. డీజే పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని గ్లామ‌ర్ ఒల‌క‌పోసింది త‌ప్ప ఆ సినిమాలో కూడా పాత్ర‌కు పెద్ద ప్రాధాన్య‌త లేదు. కాక‌పోతే ఆ సినిమాలో అందాల‌తో మాత్రం కట్టిప‌డేసింది. అదే ఆమెకు క‌లిసివ‌చ్చింది.  వ‌రుస‌పెట్టి పెద్ద సినిమా అవ‌కాశాలు కొట్టేసింది పూజా హెగ్డే.  ప్ర‌స్తుతం తెలుగులో మూడు పెద్ద సినిమాల‌ను చేజిక్కించుకుంది.  అమ్మ‌డికి యాక్టింగ్ టాలెంట్ ప్రూవ్ కాలేదు కానీ అవ‌కాశాలు ఒక‌దానిత‌రువాత ఒక‌టి క్యూ క‌ట్టేశాయ్‌. ప్ర‌భాస్,  జూనియ‌ర్ ఎన్టీఆర్, మ‌హేష్‌ బాబుల‌తో అతి త్వ‌ర‌లో న‌టించ‌నుంది. ఆ సినిమాలు సెట్స్ మీద‌కు వెళ్ల‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంది.

తెలుగు సినిమాలు స‌రే హిందీలో కూడా పెద్ద సినిమాలో అవ‌కాశం కొట్టేసింది అమ్మ‌డు. హౌస్ ఫుల్ 4లో హీరోయిన్ ఛాన్సు అందుకుంది. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్ బాబీ డియోల్ అండ్ రితేష్ దేశ్‌ముఖ్ న‌టించ‌నున్నారు. మ‌రో హీరోయిన్‌గా కృతి స‌న‌న్ క‌నిపించ‌నుంది. పూజా హెగ్డే జోరు చూస్తే మిగ‌తా హీరోయిన్లు కుళ్లుకునేలా ఉంది. గ‌తంలో పూజా హృతిక్‌తో చేసిన మొహంజ‌దారో సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాక ఆమె పేరు కూడా ఎవ‌రూ త‌ల‌వ‌లేదు. అలాంటిది ఇప్పుడు పిలిచి మ‌రీ అవాకాశాలిస్తున్నారు. పూజా టైం చాలా బాగున్న‌ట్టుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు