బాహుబలి-2.. ఇది కూడా ఒక రికార్డేనా?

బాహుబలి-2.. ఇది కూడా ఒక రికార్డేనా?

‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హవా సాగించింది. కానీ చైనాలో మాత్రం ఆ సినిమా పప్పులుడకలేదు. ఎంతో హడావుడి చేసి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేశారు. కానీ చివరికి రిలీజ్ ఖర్చులకు కూడా సరిపోలేదు వచ్చిన వసూళ్లు. ఐతే సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్ల.. ఆలస్యంగా రిలీజ్ చేయడం వల్ల.. ఇంకేవో కారణాలతో చైనాలో ఈ చిత్రం ఆడలేదని అన్నారు చిత్ర నిర్మాతలు. ‘బాహుబలి: ది బిగినింగ్’ విషయంలో ఈ తప్పులన్నీ దిద్దుకుంటామన్నారు. కానీ దీన్ని కూడా చైనాలో త్వరగా విడుదల చేయలేకపోయారు. ఇండియాలో రిలీజైన ఏడాది తర్వాత చైనాకు వెళ్తోంది ‘బాహుబలి-2’. ప్రమోషన్.. రిలీజ్ విషయంలో ఏం మెరుగు పడిందో నిర్మాతలకే తెలియాలి. ఐతే చైనా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి-2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చని తెలుస్తోంది.

బాహుబలి-2 చైనా రిలీజ్ గురించి ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కడా పెద్ద హడావుడే కనిపించడం లేదు. ఐతే నిర్మాతలు మాత్రం చైనా రిలీజ్ గురించి గొప్పలు పోతున్నారు. చైనాలో ఐమాక్స్ ఫార్మాట్లో రిలీజవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అయినా చైనీయులకు ఐమాక్స్ సినిమాలు కొత్తా? అసలు బాహుబలి తరహా సినిమాలు వాళ్లు ఎప్పట్నుంచో చూస్తున్నారు. మనకు ఇలాంటి సినిమాలు కొత్తగా కాబట్టి అబ్బురపడిపోయాం. వాళ్లు అలా కాదు. ఇక ఇండియన్ సినిమాలు చైనాలో విడుదల కావడమే కొన్నేళ్ల కిందట మొదలైంది. అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజైన ఇండియన్ మూవీస్ పట్టుమని పది ఉండవు. అలాంటపుడు అక్కడ ఐమాక్స్ ఫార్మాట్లో చైనాలో రిలీజవుతున్న తొలి ఇండియన్ మూవీ అంటూ చేసుకుంటున్న ప్రచారంలో అర్థం లేదు కదా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English