వావ్.. ఆమె బాడీ షేపులో బాటిల్

వావ్.. ఆమె బాడీ షేపులో బాటిల్

ఒక ఐడియా జీవితాన్ని మార్చేయడం సంగతేమో కానీ.. కొన్ని ఐడియాలు వినడానికే మహా విచిత్రంగా ఉంటాయి. వీటిని అమల్లో కూడా పెట్టేస్తుంటే నోరెళ్లబెట్టి వినడమో చూడడమో చేయడం.. లేదా దీనె.. జీవితం అనిపించేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. హాలీవుడ్ బ్యూటీ కిమ్ కర్దాషియన్ ఎంతటి డేరింగ్ అనే సంగతి చెప్పాల్సిన పనేమీ లేదు. న్యూడ్ గా కూడా పోజులు ఇచ్చేయగల తెగువ ఈమె సొంతం.

ఈ భామ తన పేరు మీదే ఓ సెంటు తయారు చేసి విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇలా అందాల భామల పేరుపై ఫ్రాగ్రెన్స్ లను విక్రయించడం కొత్తేమీ కాదు కాబట్టి.. ఇందులో షాక్ తినాల్సిన పనేమీ లేదు. కానీ.. ప్రతీ ప్రొడక్ట్ మార్కెటింగ్ కి ఓ వినూత్నమైన వ్హూయం ఉండాలి కదా. ఇప్పుడు తన పేరుపై తయారువతున్న సెంట్ బాటిల్స్ కి క్రేజ్ పుట్టించడం కోసం.. కిమ్ ఎంచుకున్న రూట్ చూస్తే.. ఎవరైనా షాక్ తినాల్సిందే. కిమ్ పేరిట తయారయ్యే సెంట్ సీసా.. ఆమె బాడీ షేపులోనే ఉంటుందట. ఆమె బాడీ కొలతల ప్రకారం అఛ్చం అలాగే ఉండేలా తయారు చేసేందుకు మౌల్డ్ కూడా తీసుకున్నారట.

మౌల్డ్ కోసం తాను సిద్ధమైన ఫోటోను కూడా చూపించింది కిమ్ కర్దాషియాన్. ఈ మౌల్డ్ ఏంటీ.. గోలేంటీ అనుకుంటున్నారా.. సరే ఇంకొంచెం క్లారిటీగా చెప్పుకుంటే.. కిమ్ పేరిట ఉన్న పెర్ఫ్యూమ్ బాటిల్ కొంటే.. ఆమెను చేతితో పట్టుకున్న మాదిరిగా ఫీలింగ్ వచ్చేలా ఆ బాటిల్ ఉంటుందట. ఇప్పుడు ఆ బాటిల్ కాన్సెప్ట్ ఏంటో కరెక్టుగా అర్ధమైంది కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు