కపూర్ పాప మళ్లీ మొదలెట్టిందమ్మా

కపూర్ పాప మళ్లీ మొదలెట్టిందమ్మా

టాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ ఖాతాలో చెప్పుకోదగ్గ సినిమాలే ఉన్నాయి. కానీ కెరీర్ మాత్రం కుదురుగా నడవడం లేదు. రన్ రాజా రన్ అంటూ.. టాలీవుడ్ లో హిట్టుతోనే కెరీర్ పరుగును ప్రారంభించినా.. ఆ తర్వాత టైగర్.. కొలంబస్ అంటూ రెండు సినిమాలు గట్టి దెబ్బే కొట్టాయి. దీంతో ఏడాదిన్నరకు పైగా సినిమా ఛాన్సులు రాలేదు.

అలాంటి సమయంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాను బేస్ చేసుకుని తెగ హల్ చల్ చేసి పారేసింది. బికినీలో తన ఫోటోలను తెగ షేర్ చేసేస్తూ.. జనాల అటెన్షన్ ను బాగానే రాబట్టింది. ఒకానొక సమయంలో టాప్ లెస్ అనిపించేలా ఉన్న డ్రెసింగ్ లో కూడా కనిపించడంతో.. ఈ భామకు అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు వచ్చేశారు. అలా నాగార్జునతో కలిసి రాజు గారి గది2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అదే ఊపులో అల్లు శిరీష్ తో కలిసి ఒక్క క్షణం మూవీలో కూడా కనిపించింది సీరత్ కపూర్. టచ్ చేసి చూడు కూడా ఈ స్పీడ్ లో వచ్చిన అవకాశమే.

కానీ ఆ సినిమాలన్నీ డిజప్పాయింట్ చేయడంతో లెక్కలు మారిపోయాయి. అమ్మడి వైపు ఎవరూ చూడడం లేదు. దీంతో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను బేస్ చేసుకుని సోయగాలతో వల వేస్తోంది సీరత్ కపూర్. అప్పుడే బికినీ వరకూ వచ్చేయలేదు కానీ.. అమ్మడి స్పీడ్ చూస్తుంటే మాత్రం అక్కడి వరకూ వచ్చేయడానికి పెద్దగా టైం పట్టేలా లేదు. మరి ఈ సిరీస్ అందాల షోకేస్ ద్వారా.. ఎలాంటి ఛాన్సులను ఒడిసిపడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English