అక్కడ హిట్టు కోసం భరత్ కష్టాలు

అక్కడ హిట్టు కోసం భరత్ కష్టాలు

మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను.. యూఎస్ బాక్సాఫీస్ లో మిరకిల్ ఓపెనింగ్స్ నమోదు చేసింది. అంతకు మూడు వారాల క్రితం వచ్చిన రంగస్థలం మూవీ సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ ను.. రోజుల వారీగా చూస్తే ఈజీగానే క్రాస్ చేసేస్తోంది. రిలీజ్ అయిన నాలుగు రోజులకే 2.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టిన భరత్.. ఇప్పుడు 2.6 మిలియన్ల మార్కును ఓవర్ టేక్ చేసింది. ఈ చిత్రం ఫుల్ రన్ వసూళ్లు 3.5- 4 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే 3.5 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించిన మూవీ రంగస్థలం. ఈ వీకెండ్ తో బహుశా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రంగస్థలం రన్ పూర్తయిపోవచ్చు. మొత్తం మీద 3.6- 3.7 మిలియన్ డాలర్ల దగ్గర రంగస్థలం ఆగే అవకాశాలున్నాయి. ఈ మార్కును భరత్ ను క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే.. బాక్సాఫీస్ లెక్కల దగ్గర వసూళ్లు కాదు.. పెట్టుబడులపై వచ్చిన రిటర్న్స్ పాయింట్ అవుతుంది. ఆ రకంగా చూస్తే రంగస్థలం ఇప్పటికే ఓవర్సీస్ బయ్యర్స్ కు బోలెడన్ని లాభాలను తెచ్చిపెట్టింది.

కానీ భరత్ సంగతి వేరు. మహేష్ బాబు-కొరటాల కాంబినేషన్.. దర్శకుడు స్వయంగా ఇచ్చిన హిట్టు హామీలను బేస్ చేసుకుని భారీ రేట్లకు కొనుగోలు చేశారు. 18+ కోట్లకు అమెరికా రైట్స్ కొన్నట్లు టాక్. ఇప్పుడు భరత్ అనే నేను 3.5 మిలియన్ డాలర్లను సాధించినా.. జస్ట్ బ్రేక్ఈవెన్ మాత్రమే అవుతుంది. మినిమం 4 మిలియన్లు వస్తే కాని.. పెట్టిన పెట్టుబడి తిరిగి రాదట. కానీ రంగస్థలం మాత్రం ఇప్పటికే వసూళ్ల పరంగా అక్కడ బ్లాక్ బస్టర్. కలెక్షన్స్ ఒకే స్థాయిలో ఉన్నా.. బాక్సాఫీస్ లెక్కలు అలాగే ఉంటాయ్ మరి. ఇలా చూస్తే సినిమాలను తక్కువ రేట్లకు అమ్మితేనే అందరూ సేఫ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు