బాహుబలి మోసం.. కాస్త ఆగండి గురూ!

బాహుబలి మోసం.. కాస్త ఆగండి గురూ!

తెలుగులోనే కాదు.. ఏ భారతీయ చిత్రానికి రానంత విపరీతమైన హైప్.. బాహుబలి2 చిత్రానికి దక్కింది. ముందు నుంచి విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి.. అంచనాలకు మించిన వసూళ్లు దక్కాయి. ఇప్పటివరకూ దక్కాయనే అనుకున్నాం కానీ.. అలా వచ్చేలా జనాలను పిండేసుకున్నారంటూ ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయి.

సహజంగా ఓ సినిమాకు మల్టీప్లెక్స్ టికెట్ 150 రూపాయలు ఉంటుంది. కానీ బాహుబలి ది కంక్లూజన్ విషయంలో మాత్రం 200లుగా ఫిక్స్ చేశారు. వీటిని కూడా కాంబో ఆఫర్ల కింద మార్చి వేల కొద్దీ వసూలు చేసిన వైనం కనిపించింది. బాహుబలి2 క్రేజ్ లో పడి అప్పట్లో ఈ విషయాన్ని జనాలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు బాహుబలి నిర్మాతలు మోసం చేశారంటూ ఒక వార్త వినిపిస్తోంది. ఆర్టీఐ యాక్టివిస్ట్ దివాకర్ బాబు.. ఈ విషయంపై సమాచారం అందించాలంటూ సమాచార హక్కుల చట్టం ప్రకారం చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినా సమాధానం రాలేదు. దీంతో రాష్ట్రస్థాయి సమాచార కమిషనర్ ను ఆశ్రయించారాయన. అక్కడి నుంచి ఈయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని ప్రకారం.. ఎలాంటి అనుమతులు లేకుండానే.. మల్టీప్లెక్స్ థియేటర్లలో అధిక ఛార్జీలను వసూలు చేసి.. జనాలను పిండి పారేశారట బాహుబలి ప్రొడ్యూసర్స్. ఇందులో ఎగ్జిబిటర్లకు.. థియేటర్ యాజమాన్యాలకు.. నిర్మాతలకు వాటా దక్కిందట.

ఇలా ఒక్కో టిక్కెట్టుకు అనధికారికంగా 50 రూపాయల చొప్పున వసూలు చేసి.. భారీ మొత్తాన్నే వెనకేసుకున్నారని తెలుస్తోంది. ఇలా అధికంగా వసూలు చేసిన మొత్తం కనీసం 100 కోట్లు ఉంటుందని అంటున్నారు. కాని విషయం ఏంటంటే.. ఇలా టిక్కెట్ల రేటు పెంచకపోయినా.. అసలు కేవలం బాహుబలి 1 తోనే వీరికి భారీ మొత్తంలో లాభాలు వచ్చేశాయి. కాబట్టి.. బాహుబలి నిర్మాతలు దోపిడి చేశారు.. మోసం చేశారు అని అప్పుడే అనడం కరక్ట్ కాదేమో. ఓసారి ఈ మొత్తం యవ్వారం గురించి వారు చెప్పేది కూడా వింటే.. ఏదైనా క్లారిటీ వస్తుంది. ఇలా ఒకవైపునే అన్నీ వినేసి టివిల్లో డిబేట్లు పెట్టేస్తుంటేనే.. ఇండస్ర్టీ పరువుపోతోంది. కాబట్టి రెండో వైపు వాదన కూడా వచ్చేవరకు ఆగండి గురూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు