సలహా ఇస్తాడు కానీ.. సినిమా ఇస్తాడా?

సలహా ఇస్తాడు కానీ.. సినిమా ఇస్తాడా?

రాంగోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ.. సంచలనం అనే పదానికి పర్యాయపదమే వర్మ. వివాదం ఎక్కడుంటే అక్కడ తానుండడం.. ఈయనకు ఓ సరదా. లేదా తాను ఉన్న దగ్గరే వివాదం స్టార్ట్ చేస్తుంటాడు. తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. శ్రీరెడ్డి విషయంలో తనే ఎంటర్ అయ్యి.. పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టాలని సలహా కూడా ఇచ్చాడు రాంగోపాల్  వర్మ.

సహజంగా ఇలాంటి కాంట్రవర్సీ ఏదైనా తలెత్తింది అంటే.. వర్మ నుంచి ఓ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేస్తుంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను మూవీస్ గా మలచడంలో వర్మకు పెద్ద రికార్డే ఉంది. ఇప్పుడు శ్రీరెడ్డితో రాంగోపాల్ వర్మ సినిమా అనే విషయంపై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇదంతా నిజమే అని కూడా అనుకుంటున్నారు చాలా మంది. ఇందుకు కారణం.. ఆమెకు తగిన రోల్ ఉంటే కచ్చితంగా ఆఫర్ ఇస్తానంటూ వర్మ కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇక్కడే ఓ మతలబు ఉంది.. శ్రీరెడ్డికి తగిన పాత్ర ఉంటే.. అనే కండిషన్ పెట్టాడు వర్మ. అంటే ఇఫ్పటికి అలాంటి రోల్ లేనట్లే.

ఒకవేళ ఇప్పటి వివాదం బేస్డ్ గా సినిమా తీయాలంటే.. అందులో తన పాత్రను తానే విలన్ గా చూపించుకోవాల్సి ఉంటుంది. వెనకాల జరిగిన కథ అంతా చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే వ్యవహారం కాదు కాబట్టి.. శ్రీరెడ్డి తో వర్మ సినిమా ఇప్పటికి అబద్ధమే అనుకోవచ్చు. అసలు ఆమెతో సినిమా తీసే ఆలోచన ఉంటే ఎప్పుడో టక్కుమని చెప్పేసేవాడు వర్మ. అయినా బూతులు తిట్టమని సలహా ఇచ్చినంత తేలిక కాదు కదా.. సినిమా ఆఫర్ ఇవ్వడం. అసలు వర్మకే సినిమాలు వెతుక్కునే పరిస్థితి.. ఇక శ్రీరెడ్డికి ఏం ఇస్తాడులే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు