రంగస్థలం... ఇదేమి హిట్టండీ బాబూ!

రంగస్థలం... ఇదేమి హిట్టండీ బాబూ!

ఇటీవలి కాలంలో ఏదైనా సినిమా రెండు వారాలు గట్టిగా ఆడడం గగనమైపోతోంది. వారానికో కొత్త సినిమా వస్తోన్న నేపథ్యంలో ప్రేక్షకులు కొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో ఏ సినిమాకి కూడా లాంగ్‌ రన్‌ వుండడం లేదు. ఇలాంటి ట్రెండ్‌లో రంగస్థలం రిలీజ్‌ అయి నాలుగు వారాలు అవుతున్నా ఇంకా హౌస్‌ఫుల్స్‌ నమోదు చేస్తూ ట్రేడ్‌ని విస్మయానికి గురి చేస్తోంది.

రంగస్థలం వచ్చిన దగ్గర్నుంచి వారానికి కనీసం ఒక చెప్పుకోతగ్గ చిత్రం రిలీజ్‌ అయింది. అయినప్పటికీ రంగస్థలం వసూళ్ల జోరు తగ్గలేదు. చివరకు భరత్‌ అనే నేను లాంటి భారీ చిత్రం కూడా రంగస్థలం జోరుకి అడ్డుకట్ట వేయలేదు. భరత్‌ అనే నేనుకి భారీ వసూళ్లు వస్తూనే వున్నా మరోవైపు రంగస్థలంకి కూడా హౌస్‌ఫుల్స్‌ వస్తున్నాయి. రెండు వారాల తర్వాత డ్రాప్‌ అయిపోతుందని అనుకున్న సినిమా ఇంకా ఇంత స్ట్రాంగ్‌గా రన్‌ అవడం ట్రేడ్‌ లెక్కలు ఫాలో అయ్యేవారికి షాక్‌ ఇస్తోంది.

మే 1 వరకు ఈ జోరు కొనసాగించినట్టయితే రంగస్థలం ఫుల్‌ రన్‌లో నూట పదిహేను కోట్ల షేర్‌ దాటుతుందని అంచనా వేస్తున్నారు. పోకిరి, మగధీర తర్వాత ఇలా లాంగ్‌ రన్‌ తెచ్చుకున్న మరో బ్లాక్‌బస్టర్‌ లేదంటే ఇది ఎలా ఆడుతుందనేది అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు