ఎన్టీఆర్‌కి త్రివిక్రమ్‌ కథ రెడీ చేయలేదా?

ఎన్టీఆర్‌కి త్రివిక్రమ్‌ కథ రెడీ చేయలేదా?

అజ్ఞాతవాసి పరాజయంతో డీలా పడిపోయిన త్రివిక్రమ్‌ ఎలాగైనా ఎన్టీఆర్‌ సినిమాతో తిరిగి పూర్వ వైభవం తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసమే కథ విషయంలో మామూలుగా కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. మార్చికే కథ రెడీ చేస్తానని చెప్పిన త్రివిక్రమ్‌ ఆ తర్వాత ఏప్రిల్‌ వరకు గడువు అడిగాడు.

అతని కోసం ఎన్టీఆర్‌ వేరే ఏ చిత్రం కమిట్‌ కాకుండా ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఇప్పటికీ త్రివిక్రమ్‌ కథ ఒక కొలిక్కి రాలేదట. కథపై మరింత సమయం వెచ్చించాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్‌ని ఇంకొన్నాళ్లు ఖాళీగా వుంచడం ఇష్టం లేక షూటింగ్‌ మొదలు పెట్టేసాడు. కథ ఫైనలైజ్‌ అవకుండా సీన్స్‌ తీస్తే అజ్ఞాతవాసిలా అవుతుందని భయపడి సీన్ల జోలికి పోకుండా యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ప్లాన్‌ చేసాడు.

మొదటి రెండు షెడ్యూల్స్‌లోను ఫైట్‌ దృశ్యాలే ప్లాన్‌ చేసారు. మరో రెండు, మూడు వారాల్లో తన రచయితలతో కలిసి కథ ఫైనలైజ్‌ చేసేసిన తర్వాత సీన్స్‌ చిత్రీకరణ స్టార్ట్‌ చేస్తాడట. మరోవైపు త్రివిక్రమ్‌ తీరు ఎన్టీఆర్‌కి నచ్చడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి తనకి మరో ఆప్షన్‌ లేకపోవడంతో అయిష్టంగానే ఈ చిత్రం మొదలు పెట్టాడని చెవులు కొరుక్కుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English