బన్నీ ఎంచుకున్న కథేంటి.. ఈ పాటేంటి?

బన్నీ ఎంచుకున్న కథేంటి.. ఈ పాటేంటి?

దేవిశ్రీ ప్రసాద్ ఏదైనా పెద్ద సినిమాకు ఆడియో ఇచ్చాడంటే అందులో ఐటెం సాంగ్ ఉండాల్సిందే. ఇంకా రెండు మూడు మాస్ బీట్లతో రెడీ అయిపోతాడతను. కానీ అతను సంగీతం అందించిన కొత్త సినిమా ‘భరత్ అనే నేను’లో ఆ తరహా పాటలేమీ కనిపించవు. ఇందుకు కొరటాల ఛాన్స్ ఇవ్వలేదు మరి. కథానుసారమే పాటలు ఇచ్చాడు తప్ప మాస్ మసాలా అని.. ఐటెం సాంగ్ అని ఇరికించే ప్రయత్నం చేయలేదు. సినిమా కథను బట్టే ఏదైనా ఉండాలన్న విషయం దీన్ని బట్టి స్పష్టమైపోతుంది. ఐతే అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’లోని ఒక పాట మాత్రం దీనికి భిన్నంగా అనిపిస్తోంది. ఆ పాట సినిమాలో ఎలా సింక్ అవుతుందో అర్థం కావడం లేదు.

ఈ చిత్రం నుంచి తాజాగా ఇరగ ఇరగ అంటూ ఒక పాట ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పాట బన్నీ ప్రతి సినిమాలోనూ ఉంటుంది. ఐతే బన్నీ మాస్ మసాలా సినిమాల్లో అలాంటి పాటలు పెడితే ఓకే కానీ.. ‘నా పేరు సూర్య’ ఆ తరహాలో కనిపించట్లేదు. ఇందులో బన్నీ ఎమోషనల్.. అగ్రెసివ్ సోల్జర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ పాత్రలో చాలా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఫస్ట్ ఇంపాక్ట్.. డైలాగ్ ఇంపాక్ట్.. అంటూ రిలీజ్ చేసిన వీడియోల్లో.. ఇతర ప్రోమోల్లో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సినిమాలో బన్నీ వచ్చి ఇరగ ఇరగ అంటూ ఊర మాస్ పాటలో స్టెప్పులేస్తే ఏం బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్య క్యారెక్టర్ ను ఇప్పటిదాకా చూసిన దృష్టితో ఈ పాటను చూస్తే ఆడ్‌గా అనిపించింది. ఈ పాట చూశాక ‘నువ్వెంచుకున్న రాగమేంటి..’ అనే డైలాగ్ గుర్తు తెచ్చుకుని బన్నీ ఎంచుకున్న కథేంటి.. అందులో ఈ పాటేంటి అనాలనిపిస్తోంది. మరి సినిమాలో ఈ పాట ఎలా సింక్ అవుతోంద చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు