ఎలాంటి భామను ఎలా మార్చేశారో

ఎలాంటి భామను ఎలా మార్చేశారో

మన దేశంలో ప్రతీ ఫిలిం ఇండస్ట్రీకి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. బాలీవుడ్ లో గ్లామర్ ఎక్కువ.. ఈ మధ్య పీరియాడిక్ మీద పడ్డారు. టాలీవుడ్ లో కమర్షియల్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. కోలీవుడ్ లో వాస్తవికతకు దగ్గరగా సినిమాలుంటాయి. ఇలాంటి రకరకాల థీమ్ లు ఆయా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అందుకే వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ.. నటీనటులు రాటుదేలుతూ ఉంటారు.

టాలీవుడ్ మూవీ అఖిల్ ద్వారా.. అక్కినేని అఖిల్ తో కలిసి తెరంగేట్రం చేసిన భామ సాయేషా సైగల్. పాపం.. ఆ చిత్రంలో బోలెడంత గ్లామర్ ధారబోసినా.. యాక్టింగ్ సత్తా చూపించినా.. చివరకు రిజల్ట్ ఫ్లాప్ కావడంతో.. తెలుగు సినీ పరిశ్రమ నుంచి దూరమైంది కానీ.. ఇక్కడ బాగానే అనుభవం గడించింది. ఆ వెంటనే హిందీలో శివాయ్ అంటూ కమర్షియల్ సక్సెస్ టేస్ట్ చేసిన సాయేషా.. తరువాత తమిళ్ నుంచి వచ్చిన అవకాశాలను వరుసగా అందిపుచ్చుకుంటోంది. వనమగన్ మూవీలో ఈమెకు పెద్దగా స్కోప్ దక్కపోయినా.. ఆ తర్వాత తమిళ్ లోనే మూడు ఆఫర్స్ ను దక్కించుకుంది సాయేషా.

వీటిలో కార్తితో కలిసి నటిస్తున్న కడైకుట్టి సింగం కూడా ఉంది. ఇప్పుడీ మూవీకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. గభాలున చూస్తే.. అఖిల్ మూవీలో చూసిన సుందరాంగే.. ఈ సాయేషా అంటే నమ్మడం చాలా కష్టమైన విషయం. కార్తి అంటే క్యారెక్టర్ కోసం రకరకాలుగా మారిపోవడం చూస్తూనే ఉంటాం. ఈ సినిమాలో తన సోదరుడు సూర్య లుక్ ను చూపించేస్తూ అలరిస్తుండగా.. దక్షిణాదికి చెందిన పక్కా పల్లెటూరి అమ్మాయిగా సాయేషా లుక్ మాత్రం షాకింగ్ గానే ఉంది. తెలుగులో ఈ చిత్రాన్ని చిన్నబాబు పేరుతో అనువదించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు