మెరుపుల వర్షం బాగుంది.. కానీ

మెరుపుల వర్షం బాగుంది.. కానీ

చెన్నై మెరుపుల సోయగం త్రిషా కృష్ణన్.. ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. లీడ్ హీరోయిన్ గా అయితే 15 ఏళ్ల సమయం గడిచింది. ఇంత సుదీర్ఘకాలం ఒక హీరోయిన్ కెరీర్ కంటిన్యూ చేయడం అతి కొద్దిమందికే సాధ్యం. పైగా అటు తమిళ్ లోను.. ఇటు తెలుగులోనూ తన క్రేజ్ ను కొనసాగించగలగడం నిజంగా రికార్డే.

అడపాదడపా హిందీలో కూడా మెరిసింది త్రిష. అందుకే ఈ భామకు ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా ఫ్యాన్స్ తగులుతూనే ఉంటారు. రీసెంట్ గా ఈ బ్యూటీ వరల్డ్ టూర్ వేసొచ్చింది. పలు దేశాల్లో చక్కర్లు కొట్టేసింది. బోలెడన్ని ప్రాంతాలను సందర్శించి వచ్చింది. మరి ఒక ప్రాంతానికి వెకేషన్ కి వెళితేనే బోలెడంత హుషారు వస్తుంది. అలాంటిది.. ఏకంగా వరల్డ్ టూర్ అంటే కచ్చితంగా 10 రెట్లు ఉత్తేజం పొందేయచ్చు. రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో అమ్మడిలోని ఆ ఉత్సాహం తెలిసిపోతోంది. అయితే.. ఇవే ఫోటోలు మరో విషయాన్ని కూడా బైట పెడుతున్నాయి.

ప్రస్తుతం త్రిష వయసు 34 సంవత్సరాలు పూర్తయ్యాయి. కొంత కాలం క్రితం వరకూ ఈ విషయాన్ని త్రిష బాగానే కవర్ చేసేది కానీ.. ఇప్పుడు మాత్రం అమ్మడి ఏజ్.. ఆ ఫేస్ లో బయటపడిపోతోంది. ప్రయాణాల కారణంగా ఉత్సాహం బాగానే వచ్చింది కానీ.. అలసట కారణంగా వయసు కూడా బైటపడిపోతోంది. ఇక త్రిష కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో నాలుగు ప్రాజెక్టులు వర్షం భామ చేతిలో ఉండగా.. వీటిలో తెలుగులోకి కూడా రానున్న బైలింగ్యువల్ కూడా ఒకటి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English