ప్ర‌ముఖ క‌మెడియ‌న్ కు ఆర్నెల్లు జైలు శిక్ష‌

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ కు ఆర్నెల్లు జైలు శిక్ష‌

సినిమాల్లో త‌న న‌ట‌న‌తో న‌వ్వులు పువ్వులు పూయించే ఒక హాస్య‌న‌టుడికి రియ‌ల్ లైఫ్ లో ఊహించ‌ని ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. రీల్ లైఫ్ లో క‌మెడియ‌న్ గా క‌నిపించే ఇత‌గాడు రియ‌ల్ లైఫ్ లో అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న నేరారోప‌ణ రుజువు కావ‌ట‌మే కాదు.. ఆర్నెలు జైలుశిక్ష‌ను విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త ఎంజే అగ‌ర్వాల్ ద‌గ్గ‌ర నుంచి తీసుకున్న రూ.5కోట్ల అప్పును తిరిగి చెల్లించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు కాస్తా హాస్య‌న‌టుడు రాజ్ పాల్ యాద‌వ్‌కు జైలుశిక్ష వ‌ర‌కూ వెళ్లాయి.

ఈ కేసును విచారించిన అడిష‌న‌ల్ చీఫ్ మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ అమిత్అరోరా రాజ్ పాల్ కు ఆర్నెల్లు జైలును విధించారు. అంతేకాదు.. రూ.11.2 కోట్ల జ‌రిమానాను.. ఆయ‌న స‌తీమ‌ణి రాధ యాద‌వ్‌కురూ.70ల‌క్ష‌ల ఫైన్ ను విధించారు. అనంత‌రం ఈ కేసులో భాగంగా రూ.50వేల వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేశారు.

రూ.5కోట్ల భారీ మొత్తాన్ని ఈ క‌మెడియ‌న్ ఎందుకు తీసుకున్నార‌న‌న విష‌యంలో వెళితే.. 2010లో రాజ్ పాల్ తొలిసారి తాను న‌టిస్తూ.. ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమా కోసం ఢిల్లీకి చెందిన ముర‌ళీ ప్రాజెక్టు కంపెనీ య‌జ‌మాని ఎంజీ అగ‌ర్వాల్ నుంచి ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నారు. అనంత‌రం వడ్డీతో క‌లిసి డిసెంబ‌రు 2011 నాటికి తిరిగి ఇస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ హామీని నెర‌వేర్చ‌లేదు.

దీంతో.. రాజ్ పాల్ దంప‌తుల మీద ఢిల్లీ వ్యాపారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయ‌స్థానం తాజాగా బాలీవుడ్ క‌మెడియ‌న్ కు జైలుశిక్ష‌.. భారీ ఫైన్ ను విధిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప‌లు హిందీ సినిమాల‌తో పాటు కిక్ 2 తెలుగులోనూ రాజ్ పాల్ న‌టించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు