పవన్‌ కళ్యాణ్‌కు మంచు మనోజ్ మద్దతు

పవన్‌ కళ్యాణ్‌కు మంచు మనోజ్ మద్దతు

టాలీవుడ్‌ను కొన్ని రోజులుగా కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై కొంచెం ఆలస్యంగా స్పందించాడు యువ కథానాయకుడు మంచు మనోజ్. ఈ వివాదం గురించి స్పందించమని కొన్ని రోజులుగా చాలామంది సోషల్ మీడియాలో తనను అడుగుతున్నారని.. మరికొంతమంది తాను ఈ వివాదం నుంచి దూరంగా పారిపోతున్నానని కూడా అన్నాడు మనోజ్. ఐతే తాను అలా పారిపోయే రకం కాదని అందరికీ తెలుసని అతనన్నాడు.

అవకాశాల పేరుతో అమ్మాయిల్ని వేధించడం అన్నది కేవలం సినీ రంగానికి మాత్రం పరిమితం కాదని అతనన్నాడు. తాను సినీ పరిశ్రమతో పాటు మిగతా అన్ని రంగాల్లోని కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నట్లు అతను చెప్పాడు. కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా.. పరిశ్రమలో మహిళల రక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీకి తాను మద్దతు పలుకుతున్నట్లు చెపిన మనోజ్.. దీంతో పాటు కార్పొరేట్.. రాజకీయ.. ఇతర రంగాల్లో కౌచ్‌కు వ్యతిరేకంగా కూడా పోరాడాలని మనోజ్ అన్నాడు.

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌ వివాదంలో ఇరుక్కున్న వాళ్లు.. ఇందులోకి లాగబడ్డ వాళ్లు అందరూ తనకు తెలుసని మనోజ్ అన్నాడు. ఈ వ్యవహారాన్ని మీడియా ఇంకొంచెం సున్నితంగా.. పద్ధతిగా డీల్ చేయాల్సిందని అతనన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఈ వివాదం సద్దుమణుగుతుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. చివర్లో ‘ఏపీ డిమాండ్స్‌ స్పెషల్ స్టేటస్’ అనే  హ్యాష్ ట్యాగ్‌ను అతను జోడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English