అంకుల్ మహేష్.. యూత్ మహేష్ అయ్యాడు

అంకుల్ మహేష్.. యూత్ మహేష్ అయ్యాడు

సూపర్ స్టార్ మహేష్ బాబులో ఎప్పుడూ చూడని మార్పు కనిపిస్తోంది ఈ మధ్య. ఇంతకుముందు చాలా రిజర్వ్డ్ గా కనిపించిన మహేష్.. ఈ మధ్య గలగలా మాట్లాడేస్తున్నాడు. పొడి పొడి మాటలు కట్టి పెట్టి కొంచెం పెద్ద ప్రసంగాలే చేస్తున్నాడు. ‘భరత్ అనే నేను’ విడుదలకు ముందు తర్వాత రెండుసార్లు మీడియా వాళ్లతో మహేష్ చిట్ చాట్ చేయడం విశేషం. ఇక మహేష్ ఆహార్యంలోనూ ఎన్నడూ చూడని మార్పు కనిపిస్తోంది ఈ మధ్య. గతంలో మహేష్ ఏ సినిమా వేడుకకు వచ్చినా ఫార్మల్ ప్యాంటు.. ఫార్మల్ షర్టు వేసుకుని వచ్చేవాడు. ఆ ప్యాంటూ షర్టు కూడా చాలా ప్లెయిన్‌గా ఉండేవి. యూత్ ఐకాన్ అయిన మహేష్.. ఇలా అంకుల్ లాగా వస్తాడేంటి అంటూ సోషల్ మీడియాలో అతడిపై సెటైర్లు కూడా పడేవి. చివరికి ఒక సందర్భంలో మహేష్ కొడుకు గౌతమ్ కూడా అలాగే తయారై రావడంతో సెటర్లు మరింత ఎక్కువయ్యాయి.

ఐతే కొన్ని రోజుల కిందట మహేష్ ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు జీన్స్-టీషర్ట్‌తో వచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇక తాజాగా ఈ చిత్ర థ్యాంక్స్ మీట్లో మహేష్ చాలా ట్రెండీగా కనిపించి పెద్ద షాకిచ్చాడు. టీషర్టుతో పాటు కార్గో ప్యాంట్ వేసుకుని మహేష్ ఈ వేడుకకు వచ్చాడు. ప్యాంటు నిలువుగా పాకట్లు చూసి.. మహేష్ ఇంత ట్రెండీ డ్రెస్ వేసేశాడేంటబ్బా అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. మూడేళ్ల తర్వాత సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో మహేష్ చాలా సంతోషంగా.. ఉల్లాసంగా కూడా కనిపించాడు. ఆ ఉత్సాహంలోనే తన సెన్సాఫ్ హ్యూమర్ చూపిస్తూ విలేకరులతో చిట్‌చాట్‌లో నవ్వులు పూయించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English