మహేష్ సంబరం అప్పుడే కాదు

మహేష్ సంబరం అప్పుడే కాదు

మొత్తానికి మహేష్ బాబు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అతడి కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్ వీకెండ్లో మంచి వసూళ్లు సాధించింది. మహేష్ ఇప్పుడు మామూలు ఆనందంలో లేడని నిన్న ‘థ్యాంక్స్ మీట్’లో అతడి ముఖం చూస్తేనే తెలిసిపోయింది. తొలి వారాంతంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.57 కోట్ల దాకా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల షేర్ రూ.38 కోట్ల దాకా ఉంది. ఈ వసూళ్లు నిర్మాతకు.. బయ్యర్లకు అమితానందాన్నిచ్చేవే. ఐతే అప్పుడే పనైపోయినట్లు కాదు. ఇంకా ఈ చిత్రం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. దీనిపై బయ్యర్ల పెట్టుబడులు భారీ స్థాయిలో ఉన్నాయి.

థియేట్రికల్ రన్ ద్వారా ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుంది. మహేష్ గత రెండు సినిమాలు డిజాస్టర్లయినా సరే.. ‘భరత్ అనే నేను’కు భారీగా బిజినెస్ జరిగింది. ఓపెనింగ్ వీకెండ్ తర్వాత ‘భరత్ అనే నేను’ వసూళ్లు భారీగా ఏమీ లేవు. ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది. కాబట్టి ఇంకో 40 కోట్లకు పైగా షేర్ రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అదృష్టం కొద్దీ రజినీకాంత్ ‘కాలా’ ఈ శుక్రవారం విడుదల కావట్లదు. వస్తున్న రెండూ చిన్న సినిమాలే. కాబట్టి సెకండ్ వీకెండ్లోనూ ‘భరత్ అనే నేను’ మంచి వసూళ్లే రాబట్టే అవకాశముంది. యుఎస్‌లో ఈ చిత్రం తొలి వారాంతంలోనే 2.5 మిలియన్ డాలర్లతో నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పింది. ఐతే అక్కడ కూడా ఈ చిత్రం 4 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్‌కు వస్తుంది. మరి ఫుల్ రన్లో ‘భరత్ అనే నేను’ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు