మహేష్.. పూరి ఆకాశ్.. ఒక స్టోరీ

మహేష్.. పూరి ఆకాశ్.. ఒక స్టోరీ

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ రెండు సినిమాలు చేశాడు. అందులో మొదటి సినిమా ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్‌మేన్’ కూడా ఓకే అనిపించింది. ఐతే ఈ కాంబోలో మూడో సినిమాకు కూడా సన్నాహాలు జరిగాయి కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. మహేష్ కోసం ‘జనగణమన’ పేరుతో ఓ కథ రాసిన పూరి.. ప్రిన్స్ ను మెప్పించలేకపోయాడు. సినిమాకు ఒప్పించలేకపోయాడు. ఐతే పూరి మాత్రమే కాదు.. ఆయన తనయుడు ఆకాశ్ సైతం ఒక కథ రాశాడట. పదేళ్ల కిందటే చిన్నవాడుగా ఉండగానే అతను పూరికి ఆ కథ చెప్పాడట. ఇంతకీ ఆ కథ ఏంటంటే..

మహేష్ బాబుకు ఆకాశ్ ఫ్రెండట. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమట. మహేష్ బాబును విలన్స్ చంపేస్తారట. ఆకాశ్ పెద్దవాడై తన ఫ్రెండును చంపినందుకు విలన్ల మీద ప్రతీకారం తీర్చుకుంటాడట. ఈ కథను ఒక రోజు పూరికి చెబితే నవ్వేసి.. వెళ్లి మహేష్ బాబుకు చెప్పు.. అతనొచ్చి మనిద్దరినీ తంతాడు అన్నాడట పూరి.

ఆకాశ్‌కు చిన్నతనం నుంచే నటన అంటే ఆసక్తి అని.. రోజూ తెల్లవారుజామునే లేచి తన ముందుకొచ్చి డైలాగులు చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడని.. దీంతో చిరుత.. బుజ్జిగాడు లాంటి సినిమాల్లో అవకాశమిచ్చానని.. ఐతే ఆకాశ్ హీరో అయ్యే వయసుకు వచ్చేటప్పటికి తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోమని ఆకాశ్‌కు చెప్పేసినట్లు పూరి వెల్లడించాడు. దీంతో వినాయక్.. రాజమౌళి లాంటి వాళ్లు తనను కలవడానికి వచ్చినపుడు వాళ్లకు నమస్కారం పెట్టి అవకాశాల కోసం అడిగేవాడని పూరి చెప్పడం విశేషం. ఐతే అదృష్టవశాత్తూ తాను ఇప్పటికీ లైమ్ లైట్లోనే ఉండి ఆకాశ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నానని పూరి అన్నాడు.​

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు