చిరు.. ‘భరత్ అనే నేను’ చూసి..

చిరు.. ‘భరత్ అనే నేను’ చూసి..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వేరే వాళ్ల సినిమాలను కూడా బాగానే పట్టించుకుంటున్నాడు. తన విలువైన సమయాన్ని వేరే సినిమాలు చూడటానికి కూడా ఉపయోగిస్తున్నాడు. ఆ మధ్య ‘హలో’ సినిమాను విడుదలకు ముందే చూసి తెగ పొగిడేసిన సంగతి తెలిసిందే. ఐతే నాగార్జునతో ఉన్న అనుబంధం నేపథ్యంలో చిరు ఆ సినిమా చూసి ఉండొచ్చనుకుందాం. ఐతే ఇప్పుడు మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ను ఆయన కుటుంబ సమేతంగా తొలి రోజే వీక్షించడం విశేషం.

ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘భరత్ అనే నేను’ను చూడాలని కోరి.. చిరు కోసం ఇంట్లోనే స్పెషల్ షో ఏర్పాటు చేశారట. తొలి రోజు సినిమా చూసిన చిరు ‘భరత్ అనే నేను’ గురించి పది నిమిషాల పాటు మాట్లాడినట్లు దానయ్య వెల్లడించాడు. ఈ చిత్రం చిరుకు చాలా నచ్చిందని.. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని చిరు జోస్యం చెప్పారని.. ఆయన అన్నట్లే సినిమా పెద్ద విజయం సాధించిందని దానయ్య సంతోషం వ్యక్తం చేశాడు. మహేష్ నట కౌశలాన్ని.. కొరటాల శివ దర్శకత్వ ప్రతిభను చిరు మెచ్చుకున్నట్లు దానయ్య వెల్లడించాడు.  ‘భరత్ అనే నేను’ లాంటి సినిమాను నిర్మించినందుకు తనకు చాలా గర్వంగా ఉందని.. చిరంజీవి ఈ సినిమాను ఆశీర్వదించడం చాలా సంతోషమని చెప్పాడు దానయ్య.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు