ఒక్క చ‌ర్య‌తో ప‌వ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారా?

ఒక్క చ‌ర్య‌తో ప‌వ‌న్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారా?

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ‌, సినీ అడుగుల‌పై అంద‌రి దృష్టి మ‌రోమారు ప‌డింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన అంశం అనూహ్య రీతిలో ప‌వ‌న్‌ను సైతం అందులోకి లాగిన సంగ‌తి తెలిసిందే. శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం.. ఆపై తానే దూషించమని చెప్పానంటూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరపైకి రావడంతో వివాదం మరింత పెద్దదైంది. దీంతో ప‌వ‌న్ సైతం ఎంట్రీ ఇవ్వాల్సి వ‌చ్చింది. వ్యక్తిగత దూషణలు, తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడం వెనుక టీడీపీ అనుకూల మీడియా, నారా లోకేశ్‌ కుట్ర ఉందని పవన్ ఆరోపణలకు దిగడంతో వివాదం ఇప్పుడు పవన్ వర్సెస్ కొన్ని ఛానెళ్లు, తెలుగుదేశం పార్టీ అన్నట్టు సాగుతోంది. అయితే అదే స‌మ‌యంలో రాజ‌కీయ రంగు పులుముకోవ‌డం గ‌మ‌నార్హం.

శ్రీ‌రెడ్డి ఎపిసోడ్‌ కాస్తా... పొలిటికల్‌ రంగు పులుముకుంది. ఎక్కడో స్టార్ట్‌ అయిన వ్యవహారం.. చివరకు పవన్‌ వద్ద వచ్చి ఆగింది. దీంతో ఇప్పుడు ఈ వ్యహారంలో  టీడీపీ - జనసేన మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. శ్రీరెడ్డిని వెనుక నుంచి నడిపిస్తోంది టీడీపీయేనని పవన్‌ గట్టిగా ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. వ్యక్తిగత దూషణలు, తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడం వెనుక టీడీపీ అనుకూల మీడియా, నారా లోకేశ్‌ కుట్ర ఉందని పవన్ ఆరోపణలకు దిగడంతో వివాదం ఇప్పుడు పవన్ వర్సెస్ కొన్ని ఛానెళ్లు, తెలుదేశం పార్టీ అన్నట్టు సాగుతోంది. ఇదే స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల‌కు సైతం పవ‌న్ ప్ర‌త్య‌ర్థిగా మారిపోయారు. రెండు రాష్ర్టాల్లోనూ పాత్రికేయులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేయ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం.

శ్రీరెడ్డి మొత్తం వ్యవహారంపై పవన్‌ న్యాయ పోరాటానికి రెడీ అవుతున్నారని స‌మాచారం. మరోవైపు చంద్రబాబు కూడా అదే స్థాయిలో పవన్‌పై విరుచుకుపడుతున్నారు. పవన్‌కు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని విమర్శిస్తున్నారు. తాను దీక్ష చేసిన రోజునే ఫిల్మ్‌ ఛాంబర్‌లో కూర్చోవడం కుట్రని చంద్రబాబు ఆరోపించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ మరెన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు