మెహబూబా కోసం ఎంక్వయిరీలు

మెహబూబా కోసం ఎంక్వయిరీలు

పూరి జగన్నాథ్‌ సినిమాలో హీరోయిన్‌ అంటే ఖచ్చితంగా బిజీ అయిపోతుందని ఇండస్ట్రీలో పేరుంది. అతను పరిచయం చేసిన దిషా పటానీ ప్రస్తుతం బాలీవుడ్‌ని ఏలుతోంది. అసలే హీరోయిన్ల కొరత బాగా వున్న ప్రస్తుత తరుణంలో పూరీ పరిచయం చేస్తోన్న కొత్త హీరోయిన్‌ నేహా షెట్టి గురించి ఇండస్ట్రీలో అప్పుడే ఎంక్వయిరీలు పెరిగాయి. చూడ్డానికి చక్కగా వున్న నేహ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి తనయుడు ఆకాష్‌ కంటే కూడా నేహ కోసం ఇండస్ట్రీలో ఎక్కువ మంది పోటీ పడుతున్నారట. ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఏ చిత్రం కమిట్‌ కాకూడదని ఆమె పూరీ కనక్ట్స్‌కి అగ్రిమెంట్‌ రాసిచ్చింది.

అంచేత ఇంతవరకు ఏ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు కానీ త్వరలోనే చాలా చిత్రాల్లో ఒకేసారి నటించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. యువ హీరోలు ఎవరి సరసన అయినా సూట్‌ అయ్యే రూపం కావడంతో నేహ కోసం పలువురు డైరెక్టుగా పూరీనే కాంటాక్ట్‌ చేస్తున్నారట. ఆమె ఏ సినిమాలు ఒప్పుకున్నా కానీ మూడేళ్ల వరకు ఆ వ్యవహారాలన్నీ కూడా పూరీ కనక్ట్స్‌ ద్వారానే జరగాలట.

పూరీ కనక్ట్స్‌ స్థాపించి చాలా రోజులవుతున్నా నేహా శెట్టితోనే దాని ఉనికి ఎక్కువ మందికి తెలుస్తోందనేది ఇండస్ట్రీ మాట. మరి నేహ మ్యాజిక్‌ సినిమాలోను వర్కవుట్‌ అయి మెహబూబాతో పూరికి పూర్వ వైభవం వస్తుందేమో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు