రవితేజ.. సేమ్‌ పులిహోర!

రవితేజ.. సేమ్‌ పులిహోర!

రాజా ది గ్రేట్‌ ఓ మాదిరిగా ఆడిందంటే కారణం అందులో రవితేజ అంధుడిగా నటించడమే. అతను అంధుడి పాత్ర చేయడం వల్ల ఆ చిత్రానికి కాస్త కొత్తదనం వచ్చింది. ఆ చిత్రాన్ని రొటీన్‌గా నడిపించినా కానీ బ్లయిండ్‌ క్యారెక్టర్‌ వల్ల వెరైటీ వినోదానికి ఆస్కారం వచ్చింది. అలా రవితేజకి ఆ చిత్రంతో సక్సెస్‌ వచ్చింది. అతను తన శైలిలో చేసే రెగ్యులర్‌ సినిమాలు ఇటీవలి కాలంలో ఆడడం లేదు. టచ్‌ చేసి చూడు అయితే దారుణమైన డిజాస్టర్‌ అయింది. కనీసం పది కోట్ల షేర్‌ కూడా రాని ఆ చిత్రంతో రవితేజకి చుక్కెదురైంది.

అయితే మరోసారి తన ముతక పద్ధతిలోనే 'నేల టిక్కెట్టు' చిత్రం చేస్తున్నాడు. ఇది ఫక్తు మాస్‌ మహారాజా చిత్రమనే సంగతి స్పష్టంగా తెలుస్తోంది. ఇంతవరకు రొటీన్‌ సినిమాలతోనే సక్సెస్‌ అయిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మళ్లీ అదే పంథా అనుసరిస్తున్నాడు. నిజానికి రారండోయ్‌ వేడుక చూద్దాం చిత్రంతోనే అతనికి ఫ్లాప్‌ ఎదురు కావాల్సింది. ఏదో అలా గట్టెక్కిపోయిన ఆ చిత్రాన్ని చూసి మళ్లీ సేఫ్‌గా వుండాలని సేమ్‌ ఫార్ములా ఫాలో అవుతున్నాడు.

రవితేజని ఇలాంటి మూస పాత్రల్లో చూసి విసిగిపోయిన జనం టచ్‌ చేసి చూడుని దారుణంగా తిప్పి కొట్టారు. ఈ నేపథ్యంలో నేల టిక్కెట్టుకి నేల టిక్కెట్లే తెగుతాయా లేక బాల్కనీ ఆడియన్స్‌ వరకు రీచ్‌ కాగలదా అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు