టోటల్‌గా ముంచేసిన ఆర్జీవీ!

టోటల్‌గా ముంచేసిన ఆర్జీవీ!

రాంగోపాల్‌వర్మ ప్రస్తుతం ఎలాంటి ఐడియా వేసినా అది ఫ్లాపే అవుతుందని మరోసారి తేలిపోయింది. సినిమాలుగా ఫెయిలవుతోన్న అతని ఐడియాలు మిగతా విషయాల్లోను అట్టర్‌ఫ్లాప్‌ అవుతున్నాయి. శ్రీరెడ్డితో పవన్‌ని తిట్టించి అభిమానులని కవ్వించాలని చూసిన వర్మ ఐడియా రివర్స్‌ అయింది. ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తన ఉనికి నిలుపుకోవాలని చూస్తున్నాడు కానీ వర్మని చిన్నా, చితకా వాళ్లు కూడా దారుణంగా తిట్టిపోస్తూ కనీస గౌరవం ఇవ్వడం లేదు.

గతంలో కనీసం అతని గత చిత్రాలని చూసి అయినా గౌరవించేవాళ్లు కానీ ఇప్పుడు వర్మకి ఎవరూ మర్యాద ఇచ్చి మాట్లాడడం లేదు. కాస్టింగ్‌ కౌచ్‌పై ఉద్యమంగా అవతరించిన శ్రీరెడ్డి వ్యవహారాన్ని తన తప్పుడు ఆలోచనతో పక్కదారి పట్టించిన వర్మ ఆ ఉద్యమాన్ని నిలువునా నీరుగార్చాడు. అంతే కాకుండా తనకి తానే పర్సనల్‌ డ్యామేజ్‌ చేసుకున్నాడు. ఆఫీసర్‌ సినిమా కోసం ఆర్జీవీ పబ్లిసిటీ కోసం జనాల్లోకి రావాల్సి వుంటుంది.

అప్పుడు పబ్లిక్‌ నుంచి కూడా మ్యూజిక్‌ ఎదుర్కొనే అవకాశముంది. అసలే ఆ చిత్రాన్ని ఎవరూ కొనక ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న వర్మకి ఈ వ్యవహారం మెడకి చుట్టుకుంది. మరోవైపు నాగార్జున కూడా చాలా అసహనంగా వున్నాడని, వర్మ వ్యవహారం అతనికి అసలు నచ్చడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద తన కలహ ప్రియం కాస్తా కొరివితో తలగోక్కున్న చందంగా మారిందన్న మాట. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు