ఎన్టీఆర్‌ అండర్‌ ప్రెజర్‌

ఎన్టీఆర్‌ అండర్‌ ప్రెజర్‌

ఎన్టీఆర్‌ ఇటీవలి ఫామ్‌ బాగానే వుంది కానీ తన బ్లాక్‌బస్టర్‌ కల మాత్రం తీరలేదు. మహేష్‌, చరణ్‌లాంటి సమవుజ్జీలు డౌన్‌లో వున్నపుడు ఎన్టీఆర్‌కి యావరేజ్‌ ఫలితాలతో చెల్లిపోయింది కానీ మళ్లీ వాళ్లిద్దరూ ఫామ్‌లోకి వచ్చారు. అంతే కాకుండా భారీ బ్లాక్‌బస్టర్లు ఇచ్చే సత్తా వున్న హీరోలని చాటుకున్నారు. ఎన్టీఆర్‌ మాత్రం కథల ఎంపికలో ఎప్పుడూ పొరపాట్లే చేస్తున్నాడు. ఏదో గట్టెక్కిపోయే కథలు ఎంచుకుంటున్నాడే తప్ప ఖచ్చితంగా కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌ అయ్యే కథలని ఎంచుకోలేకపోతున్నాడు.

రంగస్థలం, భరత్‌ అనే నేను ఘన విజయాల నేపథ్యంలో ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెరిగింది. జనతా గ్యారేజ్‌ అనే హిట్‌ సినిమా మినహాయిస్తే (ఇదీ కొన్ని చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ కాలేదు) ఎన్టీఆర్‌ గ్రాఫ్‌ చాలా సాధారణంగా వుంది. దీంతో త్రివిక్రమ్‌తో అతను చేసే చిత్రం చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం త్రివిక్రమ్‌ కాన్ఫిడెన్స్‌ దెబ్బతినేసి వుంది. అతనికి కథ బాగా తయారు చేసేంత టైమ్‌ కూడా ఇవ్వలేదు కనుక అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌ ఏమాత్రం కథ రాసాడనేది అభిమానులకి గుబులుగా వుంది.

రాజమౌళితో సినిమా వున్నా కానీ అది మల్టీస్టారర్‌ కనుక సక్సెస్‌ క్రెడిట్‌ తారక్‌కి పూర్తిగా దక్కదు. త్రివిక్రమ్‌ సినిమాతో పెద్ద హిట్‌ చేజిక్కించుకోకపోతే రాజమౌళి సినిమా ఎంత హిట్టయినా రాజమౌళికి, చరణ్‌కీ ఎక్కువ క్రెడిట్‌ వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English