ర‌విబాబు మ‌ళ్లీ భ‌య‌పెడుతున్నాడు

ర‌విబాబు మ‌ళ్లీ భ‌య‌పెడుతున్నాడు

థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో ప్రాచూర్యం క‌లిగించిన ద‌ర్శకులలో ర‌విబాబు ఒక‌డు. అన‌సూయ‌,అమ‌రావ‌తి, అవును సినిమాల‌తో భ‌యాన్ని ప‌రిచ‌యం చేశాడు. ఆయన‌పై హ‌లీవుడ్ సినిమాల స్ఫూర్తి ఎక్కువ‌గానే ఉంది. రెండో భాగంలో చూడండి అన్నట్టు క‌థ‌ని స‌గంలో ఆపేస్తారు. అవునులో అదే చేశాడు. ఆ సినిమా  స‌డ‌న్‌గా ముగింపు కార్డు వేసుకొన్నట్టు ఉంటుంది. దానికి త‌గ్గట్టుగానే ఇప్పుడాయ‌న ఈ సినిమాకి సీక్వెల్ తీయ‌బోతున్నాడు. అవును.. త్వర‌లోనే అవును 2 ప‌ట్టాలు ఎక్కబోతోంది. అవునులో  క‌నిపించిన న‌టీన‌టులే రెండో భాగంలోనూ భ‌య‌పెట్టడానికి సిద్ధమ‌వుతున్నారు. ప్రస్తుతం ల‌డ్డూబాబు సినిమా ప‌నిలో ఉన్నాడు ర‌విబాబు. ఆ సినిమా పూర్తయ్యకే.. అవును 2 ప్రాజెక్ట్ మొద‌లు కానుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు