నా సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దు

నా సినిమాకు రేటింగ్స్ ఇవ్వొద్దు

హీరోలంతా తమ సినిమా రిలీజైతే మంచి రేటింగులు రావాలని కోరుకుంటారు. ఎందుకంటే మంచి రేటింగ్ వస్తే ఆడియన్స్ దృష్టిని అంతగా అట్రాక్ట్ చేయవచ్చని అనుకుంటారు. కానీ యంగ్ హీరో నాగశౌర్య ఈ విషయంలో కాస్త డిఫరెంట్ గా ఉన్నాడు. తన కొత్త సినిమాకు అసలు రేటింగే ఇవ్వొద్దని అంటున్నాడు.

నాగశౌర్య ప్రస్తుతం ఓయ్ ఫేం షామిలితో కలిసి అమ్మమ్మగారిల్లు సినిమా చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ సుందర్ సూర్య దర్శకత్వంలో ఫ్యామిలీ ఓరియంటెడ్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ‘‘అమ్మమ్మగారిల్లు ఓ స్పెషల్ మూవీ. ఇలాంటి సినిమాకు రేటింగ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకే ఈ సినిమాకూ రేటింగ్స్ ఇవ్వవద్దని అందరినీ కోరుకుంటున్నా’’ అంటూ నాగశౌర్య ఓపెన్ రిక్వెస్ట్ చేశాడు.

అమ్మమ్మగారిల్లు నాగశౌర్య హీరోగా నటించిన కణం మూవీ రిలీజ్ కాబోతోంది. కానీ ఆ సినిమా గురించి కానీ.. ఆ సినిమాలో ఉండే కంటెంట్ గురించి కానీ ఒక్కమాట మాట్లాడటం లేదు. కణం తరవాత వచ్చే అమ్మమ్మగారిల్లు హిట్ అవడం గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాడు. హీరోయిన్ సాయిపల్లవిపై కోపం ఉంటే సినిమాను పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదేమో నాగశౌర్యా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు