బాలయ్య-వినాయక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

బాలయ్య-వినాయక్.. రిలీజ్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయబోవడం ఖాయం. ఈ​ విషయంలో ఏమైనా సందేహాలుంటే వాటికి ‘జై సింహా’ 100 రోజుల వేడుకతో తెరపడిపోయింది. ఈ వేదిక మీది నుంచే నిర్మాత సి.కళ్యాణ్ బాలయ్య-వినాయక్ సినిమా గురించి ప్రకటన చేశాడు. త్వరలోనే ఈ చిత్రం మొదలవుతుందని.. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించేశాడు.

కొన్ని రోజుల కిందటి వరకు ‘యన్.టి.ఆర్’ సినిమానే సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు. కానీ దాన్ని దసరాకు షెడ్యూల్ చేయడంతో సంక్రాంతి సెంటిమెంటును బాలయ్య విడిచిపెట్టేశాడే అని ఆశ్చర్యపోయారంతా. కానీ సంక్రాంతికి వినాయక్ సినిమాను షెడ్యూల్ చేసి పెట్టుకున్నారని ఇప్పుడు వెల్లడైంది.

అంటే నాలుగు నెలల వ్యవధిలో బాలయ్య అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడన్నమాట. ‘ఇంటిలిజెంట్’ లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన వినాయక్‌తో సి.కళ్యాణ్ మళ్లీ సినిమా తీయాలనుకోవడం.. ఈ చిత్రంలో నటించడానికి బాలయ్య ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. కథ ఏమీ అనుకోకుండానే ఈ సినిమాకు బాలయ్య కమిట్ కావడం మరింత షాకిచ్చే విషయం. ముందు ఆకుల శివతో కథ తయారు చేయించి దాంతోనే సినిమా తీయాలని వినాయక్ అనుకున్నాడు.

ఐతే ఇప్పుడు ఆలోచన మారిందని.. కన్నడ సూపర్ హిట్ మూవీ ‘ముఫ్తి’ని రీమేక్ చేయాలని అనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. కథ​​ ఏదైనప్పటికీ ‘యన్.టి.ఆర్’ ముగిసే దశలో ఈ చిత్రం మొదలువుతుందని.. నాలుగైదు నెలల్లో దీన్ని పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English