ఆ హీరోయిన్లు అవసరమా నాయనా?

ఆ హీరోయిన్లు అవసరమా నాయనా?

కచ్చితంగా ఆయన ఓ పెద్ద హీరోనే. మాస్ లో బోలెడంత క్రేజ్ ఉంది. కష్టపడి పైకొచ్చిన హీరోగా గుర్తింపు ఉంది. మూవీలో మ్యాటర్ ఉంటే.. కెరీర్ బెస్ట్ సాధించేస్తూ ఉంటాడు. ఫ్లాప్ వస్తే బ్రేక్ తీస్కోవడం చూస్తుంటాం. హిట్ అనిపించుకున్న మూవీ తర్వాత కూడా గ్యాప్ వచ్చిన పరిస్థితికి కారణం ఈయనే అంటారు. ఈ మధ్యనే ఓ ఫ్లాప్ మూవీతో పలకరించిన ఈ హీరో.. చకచకా మరో మాస్ మూవీని రిలీజ్ కి సిద్ధం చేసేస్తున్నాడు.

రీసెంట్ గా ఈ చిత్రానికి టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఎక్కువ సేపు హీరో.. కాసేపు హీరోయిన్ ని చూపించిన ఈ ట్రైలర్.. వీరిద్దరూ జంటగా కనిపించే సీన్స్ కూడా ఉన్నాయి. ఇద్దరి మొహాలు చూస్తుంటే.. ఆడియన్స్ ఆశ్చర్యపోతారని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే.. ఇద్దరిలోనూ ఏజ్ గ్యాప్ అంత ఎక్కువగా కనిపిస్తోంది. ఈయనేమో 50ల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అయిపోయాడు. ఆ అమ్మాయి ఏజ్ మరీ తక్కువగా కనిపిస్తోంది. ఇద్దరూ జంట అని ఎవరైనా చెబితేనే నమ్మాల్సిన పరిస్థితి.

ఈ వయసుకి మరీ అంతగా చిన్నపిల్లలా కనిపిస్తున్న హీరోయిన్ అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటివే చేసిన అనుభవం ఈయనకు ఉంది. నాకు ఆ హీరోయిన్ కావాలి అని అడిగి మరీ ఇలా కాంబోలు సెట్ చేసుకుంటాడట ఆ హీరో. అంతగా నప్పదని దర్శకులు చెప్పినా కూడా ఏ మాత్రం వినడు అని అంటున్నారు. కాకపోతే ఆ కొత్త జనరేషన్ అమ్మాయిలు.. ఇతని మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు లాగించేస్తున్నారని టాక్. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు