చెర్రీని కేవలం రెండుసార్లే చూశా

చెర్రీని కేవలం రెండుసార్లే చూశా

బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మన దగ్గరకు చాలా మంది హీరోయిన్లే ఇంపోర్ట్ అవుతుంటారు. కానీ ఇలా వచ్చినవారితో పోల్చితే.. ఇక్కడ కుదురుకున్న వారి కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం.. వాళ్లకు గ్రాండ్ లాంఛింగ్ లభించకపోవడమే. కానీ తొలి సినిమానే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో చేయడమే కాకుండా.. భారీ హిట్టు కొట్టేసిన కియారా అద్వానీపై.. టాలీవుడ్ జనాలు బాగానే కన్నేశారు.

ఈ బాలీవుడ్ భామకు వరుస ఆఫర్స్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. కానీ భరత్ అనే నేను రిలీజ్ కాకముందే.. కియారా అద్వానీ మరో భారీ చిత్రానికి కూడా సైన్ చేసేసింది. సూపర్ స్టార్ తో మూవీ చేస్తూనే.. ఆ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చిన పరిస్థితిలో.. మెగా పవర్ స్టార్ మూవీ ఛాన్స్ అందుకుంది కియారా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కియారా అద్వానీ నే హీరోయిన్. ఇప్పటికే కొన్ని సీన్స్ షూటింగ్ చేసేసింది కూడా. త్వరలో హీరోతో కలిపి షూటింగ్ చేయడానికి కూడా సిద్ధమైపోతోంది.

ఇప్పటివరకూ రామ్ చరణ్ ను రెండు సార్లు మాత్రమే కలిసిందట కియారా. తామిద్దరం కలిసి నటించబోతున్న సినిమాకు ముహూర్తం షాట్ సమయంలో ఒకసారి.. రీసెంట్ గా ఆడియో లాంఛ్ తర్వాత పార్టీ సమయంలో ఒకసారి మాత్రమే కలిసిందట కియారా. చెర్రీతో వర్క్ చేయనుండడం చాలా ఎగ్జైటింగ్ గా ఉందంటున్న ఈ భామ.. అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేసేస్తానని నమ్మకంగా చెబుతోంది. అయితే భరత్ పాటల్లో ఆమె దట్టించిన గ్లామర్ చూశాక.. బోయపాటి సినిమాలో చరణ్‌ సరసన రచ్చ లేపుతుందని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు