శ్రీరెడ్డి ‘మెగా’ వాంగ్మూలం

శ్రీరెడ్డి ‘మెగా’ వాంగ్మూలం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పెద్ద బూతు మాటతో దూషించి పెద్ద దుమారమే రేపింది శ్రీరెడ్డి. అప్పట్నుంచి మెగా అభిమానులు ఆమెను లక్ష్యంగా చేసుకున్నట్లున్నారు. దీని గురించి ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి. తాజాగా ఆమె మెగా ఫ్యామిలీకి.. అభిమానులకు హెచ్చరికలు జారీ చేసింది. తనకు ఏమైనా జరిగితే మెగా ఫ్యామిలీదే బాధ్యత అని ఆమె అంది. తనకు పవన్ అన్నయ్య నాగబాబు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె ఆరోపించింది.

‘‘నాకు చాలా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుండి! నాకు ఏమన్నా జరిగితే.... దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న వాంగ్మూలం ఇది’’ అని శ్రీరెడ్డి పేర్కొంది.

ఇక మీడియాను బహిష్కరించాలంటూ పవన్ చేసిన ట్వీట్ పై శ్రీరెడ్డి స్పందిస్తూ.. ‘‘పవన్‌ కళ్యాణ్‌ గారూ... మీడియాని బాయ్‌కాట్‌ చేసే దమ్ము ఎవరికీ లేదు. ఇది మీరు గుర్తించాలి. త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి, మీడియా వాళ్ళతో ఎందుకు సార్‌ గొడవలు పెట్టుకుంటారు’’ అని శ్రీరెడ్డి అంది.

పవన్‌ ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’లో సినిమాలో మీడియా గురించి మాట్లాడిన వీడియోను ఆమె జత చేయడం విశేషం. అందులో రాజకీయ నాయకుడైన ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి.. ‘‘రేయ్‌... మేం (మీడియా) మీ మీద (రాజకీయ నాయకులపై) పడి బతకడం లేదు. మీరే మామీద పడి బతుకుతున్నారు. నీ గురించి మాట్లాడటం మానేస్తే నీ బొమ్మ టీవీలో చూపించడం మానేస్తే... ఏం అవుతావు. మాయం అవుతావు. ఆ తర్వాత కాళ్లావేళ్లా పడి బతిమాలతావు’’ అని పవన్ అంటాడు.  పవన్ కొందరు  మీడియా సంస్థల యజమానుల ఫొటోల్ని షేర్ చేయడం ద్వారా అభిమానులు వాళ్లపై దాడి చేయమని ఉసిగొల్పుతున్నట్లే ఉందని శ్రీరెడ్డి అభిప్రాయపడింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English