సాయిపల్లవి ఫోన్ చేస్తే శౌర్య తీయలేదట

సాయిపల్లవి ఫోన్ చేస్తే శౌర్య తీయలేదట

నాగశౌర్య-సాయిపల్లవి గొడవకు సంబంధించి కొత్త ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఈ గొడవ విషయంలో తన వెర్షన్ చెప్పడానికి సాయిపల్లవి ఫోన్ చేసినా.. శౌర్య ఫోన్ తీయలేదట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. ఒక కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని ఇరిటేట్ చేసిన కోస్టార్ ఎవరు అని అడిగితే.. సాయిపల్లవి పేరు చెప్పాడు.

సీరియస్‌గానే ఈ విషయం చెప్పిన శౌర్య.. సెట్లో సాయిపల్లవి డామినేషన్ గురించి కూడా వివరించాడు. సినిమాలో వేరే వాళ్ల పాత్ర ఫోకస్ కావడం ఆమెకు ఇష్టముండదని ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సాయిపల్లవి చూసిందట. వెంటనే శౌర్యకు ఫోన్ చేయగా అతను అందుబాటులోకి రాలేదని.. తనతో మాట్లాడలేదని ఆమె చెప్పింది.

తాను సెట్లోకి వెళ్తే తన పాత్ర మీదే దృష్టి ఉంటుందని.. ఇంకేదీ పట్టించుకోనని.. ఒకటికి పదిసార్లు దర్శకుడితో ఇదే విషయం చర్చిస్తానని.. ఇదే శౌర్యకు ఇబ్బంది కలిగించి ఉండొచ్చని సాయిపల్లవి చెప్పింది. తనకు శౌర్యతోనే కాదు.. ఎవరితోనూ ప్రత్యేకంగా గొడవలేమీ లేవని ఆమె స్పష్టం చేసింది. శౌర్య మంచి నటుడని.. చాలా కామ్‌గా ఉంటాడని ఆమె కితాబిచ్చింది. మరి అతను తన విషయంలో అలా ఎందుకు అనుకున్నాడో తెలియదని ఆమె చెప్పింది.

ఇంతకుముందు ‘కణం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సైతం సాయిపల్లవి శౌర్య గురించి చాలా పాజిటివ్‌గానే మాట్లాడింది. అయినా శౌర్యలో ఎలాంటి స్పందన లేదు. సాయిపల్లవిపై కోపం ఉంటే ఉండొచ్చు కానీ.. అసలు ‘కణం’ ప్రమోషన్లకే రాకుండా అతను ఆగిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు