మెగా డాట‌ర్ పై శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!

మెగా డాట‌ర్ పై శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను న‌టి శ్రీ‌రెడ్డి అస‌భ్య ప‌దజాలంతో దూషించ‌డంపై స‌ర్వ‌త్రా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. అయితే, త‌న‌తో వ‌ర్మ ఆ మాట అనిపించార‌ని, ప‌వ‌న్ కు ఆయన త‌ల్లికి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే, ఆ త‌ర్వాత కూడా ప‌వ‌న్ పై, ఆయ‌న కొన్ని మీడియా సంస్థ‌లపై ట్విట్ట‌ర్ లో చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై శ్రీ‌రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. దీంతో, శ్రీ‌రెడ్డిపై ప‌వ‌న్ ఫ్యాన్స్ మ‌రింత రెచ్చిపోయి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కేమ‌న్నా అయితే మెగా ఫ్యామిలీదే బాధ్య‌త అని, త‌న‌ను చంపేస్తామ‌ని బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది.  

తాజాగా, మెగా ఫ్యామిలీపై త‌న ఫేస్ బుక్ ఖాతాలో శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. ``నాకేమ‌న్నా అయితే, మెగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. మ‌న‌సులో క‌క్ష్య ఉండి ఏం చేసినా వాళ్ల‌దే రెస్పాన్సిబిలిటీ. ఇది స్వ‌యంగా నా స్వ‌హ‌స్తాల‌తో రాస్తున్నా నా వాంగ్మూలం....ఐ హ్యావ్ డేంజ‌రెస్ థ్రెట్స్ ఫ‌ర్ మై కెరీర్ అండ్ లైఫ్ # గ‌వ‌ర్న‌ర్, #హోమ్ మినిస్ట‌ర్, # చీఫ్ మినిస్ట‌ర్ # ప్రైమ్ మినిస్ట‌ర్`` అంటూ శ్రీ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

అంతేకాకుండా, మెగా ఫ్యామిలీపై, నాగ‌బాబుపై శ్రీ‌రెడ్డి  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. నాగ‌బాబు గారు కంపెనీ ఆర్టిస్టుల‌కు చేసిన సాయం చాలా చిన్న‌ద‌ని, ఇంకా చాలా విష‌యాలు వ‌దిలేశార‌ని....న్యాయం జ‌రిగేవ‌ర‌కు త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని...ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అకృత్యాల‌ని....జులుంను స‌హించ‌మ‌ని  శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అంతేకాకుండా, మెగా ఫ్యామిలీకి సంబంధించి శ్రీ‌రెడ్డి మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ``నేను అంత‌కు ముందు చెప్పానుగా 4 ఫ్యామిలీస్ జులుం గురించి...చూడండి నాగ‌బాబుగారు నాక‌న్నా వ‌య‌సులో పెద్ద‌వారు, సీనియ‌ర్ యాక్ట‌ర్...ఐ రెస్పెక్ట్ యు...బ‌ట్ ...మీ బెదిరింపుల‌కు, వార్నింగ్ ల‌కు భ‌య‌ప‌డే వాళ్ల‌లో నేను లేను. మెగా ఫ్యామిలీ సొత్తు కాదు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ...జులుం ప్ర‌ద‌ర్శించ‌డానికి...మీ అమ్మాయిని తీసుకొచ్చారు క‌రెక్ట్....మెగా ఫ్యామిలీ అమ్మాయిని ఎవ‌రూ కెలుకుదామ‌ని అనుకోరు...అంత ప‌ద్ధ‌తిగా ఉన్న మీ అమ్మాయి పైన కూడా ప్రేమ వ్య‌వ‌హారాలు, ర‌క‌ర‌కాల వ్య‌క్తుల‌తో పెళ్లి అని రూమ‌ర్స్ వ‌చ్చాయి...``అని శ్రీ‌రెడ్డి త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. మొత్తానికి తాజాగా శ్రీ‌రెడ్డి పోస్టుల‌తో ....నాగ‌బాబు, ప‌వ‌న్ తో పాటు  మొత్తం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై మెగా ఫ్యామిలీ రియాక్ష‌న్ ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ఆసక్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English