రివర్స్‌లో పవనే ఇరుక్కునేలా ఉన్నాడే..

రివర్స్‌లో పవనే ఇరుక్కునేలా ఉన్నాడే..

 మొన్నటి నుంచి మీడియా మీద పెద్ద ఎత్తునే పోరాటం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఉన్నట్లుండి పవన్‌లో ఇంత ఆవేశం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా మీడియాను టార్గెట్ చేసింది లేదు. ఐతే తనకు వ్యతిరేకంగా మీడియా పని చేస్తోందని నమ్ముతున్న పవన్ ఆయా సంస్థల అధినేతల్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం సరే కానీ.. ఈ క్రమంలో అతను చేస్తున్న ట్వీట్లు జనాల్ని గందరగోళానికి గురి చేస్తున్నాయి.

ఎప్పుడో ఐదేళ్ల కిందట టీవీ-9 రవిప్రకాష్‌ మీదికి ఆ సంస్థ ఉద్యోగి బూటు విసరడం.. ఆ తర్వాత అతను రవిప్రకాష్ కాళ్ల మీద పడ్డ వీడియో బయటికి రావడం తెలిసిందే. దాన్ని పవన్ ఇప్పుడేదో కొత్తగా ఇన్వెంట్ చేసి బయటికి తీసినట్లుగా షేర్ చేశాడు.

దాని సంగతలా వదిలేస్తే శ్రీరెడ్డి తనను బూతు తిట్టిన వీడియోను పవన్ షేర్ చేస్తూ.. తన తల్లిని శ్రీరెడ్డి దూషించిన వీడియోను పదే పదే ప్రసారం చేయడం ద్వారా టీవీ ఛానెళ్లు డబ్బులు సంపాదించాయని ఆరోపించాడు. ఐతే నిన్న తెలుగు టీవీ ఛానెళ్ల ఎడిటర్లందరూ సమావేశమై ఉమ్మడిగా ఒక ప్రకటన చేశారు. శ్రీరెడ్డి అన్న బూతు మాటను ఏ ఛానెల్ కూడా ప్రసారం చేయలేదని.. ఆ మాటను మ్యూట్ చేశామని పేర్కొన్నారు. ఐతే తాము మ్యూట్ చేసిన చోట ఒరిజినల్ వీడియోలోని మాటను రీప్లేస్ చేసి ఫ్యాబ్రికేట్ చేసిన వీడియోను పవన్ ప్రచారంలోకి తీసుకొచ్చ తమపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాడని టీవీ ఛానెళ్ల యాజమాన్యాలు అంటున్నాయి.

నిజానికి ఆ బూతు మాటను తమకంటే పవనే ఎక్కువగా ప్రచారంలోకి తీసుకెళ్తూ దాని ద్వారా ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తున్నాయి. ఈ విషయమై పవన్ మీద రివర్స్‌లో కేసులు పెట్టడానికి యాజమాన్యాలు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తానికి ఈ ఇష్యూలో అవతలి వాళ్లను బ్లేమ్ చేయబోయి పవన్ తనే బ్లేమ్ అవుతున్నట్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు