మరి 2.0 ఎప్పుడబ్బా?

మరి 2.0 ఎప్పుడబ్బా?

రజినీకాంత్ కొత్త సినిమా ‘కాలా’ ఎప్పుడో రావాల్సింది. కానీ ’2.0’ కోసం దాన్ని హోల్డ్ చేసి పెట్టారు. ఆ చిత్రం జనవరి 25నే రావాల్సింది. వాయిదా పడింది. ఆ తర్వాత ఏప్రిల్ 14కి అనుకున్నారు. ఆ డేటుకీ రాలేదు. ఇంతలో ‘కాలా’ను ఏప్రిల్ 27కి షెడ్యూల్ చేశారు. ఐతే తమిళనాట సమ్మె కారణంగా ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు.

‘2.0’ను జూన్ నెలకు వాయిదా వేయడం వల్లే కాలాను ఏప్రిల్ 27కు షెడ్యూల్ చేసినట్లు చెప్పకున్నారు అప్పట్లో. కానీ ఇప్పుడు ‘కాలా’నే జూన్ 7కు వాయిదా పడిపోయింది. మరి ఇది జూన్లో వస్తే ’2.0’ సంగతేంటన్న సందేహాలు మొదలయ్యాయిప్పుడు.

రజినీకాంత్ సినిమాలు రెంటిని ఒకే నెలలో విడుదల చేసే అవకాశాలు ఎంతమాత్రం లేదు. ముందు నుంచి ‘2.0’కి.. ‘కాలా’కు మూణ్నాలుగు నెలల గ్యాప్ ఉండాలనే అనుకుంటున్నారు. ఎప్పుడో పూర్తయిన ‘కాలా’ను హోల్డ్ చేసి పెట్టడానికి కూడా కారణమదే. మరి ‘కాలా’ జూన్ 7న రాబోతోందంటే.. ఇంకో మూణ్నాలుగు నెలల తర్వాతే ‘2.0’ వస్తుందన్నమాట. బహుశా దసరాకో లేదంటే దీపావళికో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశముంది.

ముందు అనుకున్న ప్రకారమైతే ‘2.0’ 2017 దీపావళికి రావాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంకో ఏడాదికి కానీ ఈ చిత్రం రిలీజయ్యేలా లేదు. ఇలా పలుమార్లు వాయిదా పడటం వల్ల ‘2.0’ మీద ఆసక్తి అంతకంతకూ తగ్గిపోతోంది. ఇంతకీ ఈ సినిమా పక్కాగా ఎప్పుడొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English