ఎట్టకేలకు బాహుబలి-2కు మోక్షం

ఎట్టకేలకు బాహుబలి-2కు మోక్షం

ఇంకో వారం రోజుల్లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలై ఏడాది పూర్తవుతుంది. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ చిత్రం విడుదలై భారీ వసూళ్లు సాధించింది. ప్రాథమిక విడుదల తర్వాత పలు దఫాల్లో జపాన్ సహా పలు దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఐతే చైనాలో విడుదల విషయంలో మాత్రం బాగా ఆలస్యం జరిగింది.

‘బాహుబలి: ది బిగినింగ్’ తరహాలో కాకుండా సాధ్యమైనంత త్వరగా అక్కడ రిలీజ్ చే్ద్దామని చాలా ప్రయత్నమే చేశారు కానీ అది ఫలించలేదు. ఇదిగో అదిగో అంటూ నెలలు నెలలు గడిచిపోయాయి. చివరికి ‘బాహుబలి-2’ ఇండియాలో రిలీజైన ఏడాదికి అక్కడ విడుదల కాబోతోంది.

మే 4న ‘బాహుబలి: ది కంక్లూజన్’ చైనా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందుకు సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. దాదాపు పదివేల థియేటర్లలో ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయనున్నారట.‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అదిరిపోయే వసూళ్లు సాధించింది కానీ.. చైనాలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అక్కడ వచ్చిన వసూళ్లు రిలీజ్ ఖర్చులకే సరిపోయాయి.

బాహుబలి తరహా సినిమాలు చైనీయులకు కొత్తేమీ కాకపోవడమే అక్కడ సరైన వసూళ్లు రాకపోవడానికి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఐతే సరైన ప్రమోషన్.. మార్కెటింగ్ లేకపోవడం.. రిలీజ్ ఆలస్యం కావడం వల్లే బాహుబలి-1 అక్కడ ఫెయిలైందని.. బాహుబలి-2 విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తామని నిర్మాతుల చెప్పారు.  మరి బాహుబలి-2 విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు