పవన్ రాంగ్ స్టెప్ వేశాడా?

పవన్ రాంగ్ స్టెప్ వేశాడా?

కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి రోడ్డు మీద నిరసన తెలపడం.. టీవీ స్టూడియోల్లో చర్చలు పెట్టడం కంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిదంటూ శ్రీరెడ్డికి న్యాయబద్ధమైన సలహానే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. కానీ ఆమె దాన్ని సానుకూలంగా స్వీకరించకుండా పవన్ ను అనరాని బూతు మాట అంది. దీని వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని తర్వాత వెల్లడైంది. ఒక్కసారిగా మెగా ఫ్యామిలీ సభ్యులు.. అభిమానులు.. ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ పవన్ కు మద్దతుగా నిలిచారు. గట్టిగా వాయిస్ వినిపించారు. పవన్ మీద ఎక్కడ లేని సానుభూతి కనిపించింది. అతడి ఇమేజ్ పెరిగింది. ఇన్నాళ్లూ ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న మెగా ఫ్యామిలీ కూడా ఏకతాటిపైకి వచ్చింది. ఈ పరిణామాలన్నీ పవన్ కు మేలే చేశాయి. రాజకీయంగా కూడా అతడికి కలిసొచ్చేలా కనిపించాయి.

ఈ వ్యవహారంపై ఎంత రగడ జరుగుతున్నా పవన్ మౌనంగానే ఉన్నాడు. అది అతడి ఇమేజ్ ను మరింత పెంచింది. అందరూ తన గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నపుడు సెలెంటుగా ఉండటం అన్నది తెలివైన ఎత్తుగడే. ఆ తరహా సంయమనం పాటించడం అందరి వల్లా కాదు. పవన్ సరైన దిశలోనే వెళ్తున్నాడని.. పరిణతితో వ్యవహరిస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ పవన్ ఆలోచన అంతలోనే మారిపోయింది. మీడియాను.. రాజకీయ ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. నిన్న ఫిలిం ఛాంబర్ దగ్గరికి వచ్చి చాలా హంగామా చేశాడు. ఇది కొంచెం అతిగా అనిపించింది. లాయర్లతో మీటింగ్ పెట్టి మొత్తం వీడియో చిత్రీకరించి రిలీజ్ చేశాడు. అది చాలా డ్రమాటిగ్గా అనిపించింది. ఈ రోజు కూడా అన్నపూర్ణ స్టూడియోలో హడావుడి నడుస్తోంది. ఈ పరిణామాలతో అంతకుముందు పవన్ కు వచ్చిన పాజిటివ్ ఇమేజ్ దెబ్బ తింటోందేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. సైలెంటుగా ఉండి తెచ్చుకున్న పాజిటివ్ ఇమేజ్.. సానుభూతిని పవన్ ఇప్పుడు అతిగా స్పందించడం ద్వారా దెబ్బ తీసుకుంటున్నాడేమో అనిపించట్లేదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English