సంయమనం పాటించండి, ఎవడ్నీ వదలను: పవన్‌

సంయమనం పాటించండి, ఎవడ్నీ వదలను: పవన్‌

పవన్‌కళ్యాణ్‌ మీడియాపై యుద్ధంలో డైరెక్ట్‌ అయిపోయి మూడు ఛానళ్లపై దాడి చేస్తోన్న నేపథ్యంలో అతని దగ్గర వున్న ఆధారాలేంటి, ఈ వ్యవహారంలో అతను తీసుకునే తదుపరి చర్యలేంటి అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిన్న అంతా ట్వీట్లతో యాక్టివ్‌గా వున్న పవన్‌ నేడు కూడా ఆ పరంపర కొనసాగించాడు. దీనిని బట్టి అతను దీనిని అంత తేలిగ్గా వదలడని అర్థమవుతోంది. మరోవైపు అభిమానులు పవన్‌ కోసం పడిగాపులు పడుతున్నారు. అతను ఎక్కడ వుంటాడని న్యూస్‌ వస్తే అక్కడికి వెళ్లిపోతున్నారు.

కత్తి మహేష్‌లాంటి వాళ్లు కనిపిస్తే ఘెరావ్‌ చేస్తున్నారు. అభిమానుల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెచ్చుకుంటోన్న నేపథ్యంలో తనకోసం వచ్చిన కొందరు అభిమానుల్తో పవన్‌ ముచ్చటించాడు. వారిలో ఎవరినీ వదిలేది లేదని, సుదీర్ఘమైన న్యాయ పోరాటానికే సిద్ధమయ్యానని, మీరు సంయమనం పాటించాలని అభిమానులకి చెప్పాడు. ఒకవేళ మీరు కనుక సంయమనం కోల్పోయి దాడులకి పాల్పడితే దానిని తమకు వ్యతిరేకంగా మలచుకుని దీనిని సైడ్‌ ట్రాక్‌ పట్టిస్తారని, కనుక ఎలాంటి ఆగ్రహావేశాలకి లోను కాకుండా తాను చేసేది చూస్తుండమని చెప్పాడు. మరోవైపు సినీ ప్రముఖులు, పలు యూనియన్లు కలిసి చాలా విషయాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నాయి.

మీడియాని సంప్రదిస్తోన్న సినిమా వాళ్లపై చెక్‌ పెట్టడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి లీగల్‌ కమిషన్‌ని సినిమా పరిశ్రమలోనే రూపొందించడానికి చూస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ వాళ్ల మీదే కుట్రలకి పాల్పడుతోన్న రాంగోపాల్‌వర్మలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా పలు సంఘాలు చర్చిస్తున్నాయి. దీనిపై వచ్చే వారమే ఒక ప్రకటన లేదా మీడియా సమావేశం జరగవచ్చునని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English