ఒక్క మాటతో శ్రీరెడ్డి మాయం

ఒక్క మాటతో శ్రీరెడ్డి మాయం

ఆచి తూచి మాట్లాడాలని పెద్దలు ఊరికే అనరు. ఎక్కడో మొదలు పెట్టి, ఎటో పోయి ఆ తర్వాత ఒక ఉద్యమ నాయకురాలిగా అవతరించిన శ్రీరెడ్డి అత్యుత్సాహంలో మాట తూలింది. అఫ్‌కోర్స్‌ రాంగోపాల్‌వర్మ సలహా మేరకే పవన్‌కళ్యాణ్‌ని దూషించినా కానీ అలా ఒకరు చెబితే ముందు, వెనక ఆలోచించకుండా, అకారణంగా అంత పెద్ద నాయకుడిని పట్టుకుని దూషిస్తుందా అని అంతవరకు ఆమె వెంట నడిచిన వాళ్లే తిట్టారు.

అంతవరకు ఆమెని మోసిన మీడియా కూడా ఇప్పుడు డిఫెన్స్‌లో పడిపోయింది. ఆమెని తీసుకొచ్చి అంత కాలం టీఆర్పీల కోసం పాకులాడడమే తప్పు అని ప్రతి ఒక్కరూ తప్పుబడుతోన్న నేపథ్యంలో శ్రీరెడ్డిని ఎవరూ చర్చలకి పిలవడం లేదు. పవన్‌ని తిట్టిన తర్వాత రెండు రోజులు కనిపించకుండా వుండి, అటుపై మళ్లీ వచ్చి ఛానల్స్‌లో కనిపించాలని శ్రీరెడ్డి భావించింది. నిజానికి టీవీ9తో చర్చాగోష్టికి టైమ్‌ కూడా ఫిక్స్‌ చేసుకుంది. కానీ ఇంతలో పవన్‌కళ్యాణ్‌ అనూహ్యంగా రివోల్ట్‌ అయ్యాడు. దీంతో మీడియా మొత్తం ఈ వ్యవహారంలో డిఫెన్స్‌లో పడింది. శ్రీరెడ్డితో చర్చించడానికి ఎవరూ సుముఖత చూపించడం లేదు. ఇప్పుడు ఆమెని పిలిపిస్తే తప్పకుండా ఆ తిట్టు గురించి ఎక్కువ డిగ్‌ చేయాల్సి వస్తుంది.

అదొక కుట్ర అనే పవన్‌ ఆరోపణల నేపథ్యంలో ఇక దానిని తవ్వడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. దీంతో శ్రీరెడ్డి టోటల్‌గా గాయబ్‌ అయింది. ఈ గొడవ సద్దుమణిగాక అయినా మీడియా ఆమెని మళ్లీ ఎంకరేజ్‌ చేస్తుందనేది లేదు. ఎందుకంటే పబ్లిక్‌ ఇప్పటికే చాలా వెక్స్‌ అయి తిరుగుబాటులో వున్న నేపథ్యంలో ఇలాంటి పంచాయితీలు పెట్టడానికి ఇప్పట్లో ఏ ఛానల్‌ సాహసించకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు