డైరెక్టర్లకి వుండాలి, హీరోలేం చెయ్యలేరు

డైరెక్టర్లకి వుండాలి, హీరోలేం చెయ్యలేరు

రంగస్థలం, భరత్‌ అనే నేను చిత్రాలని చూస్తే పూర్తిగా దర్శకుల కన్విక్షన్‌ వల్ల సక్సెస్‌ అయిన సినిమాలివి. అలాగే అజ్ఞాతవాసి, స్పైడర్‌లు చూస్తే దర్శకుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఫ్లాపయినవి. ఒక స్థాయికి వచ్చిన దర్శకుడిని ఏ హీరో క్వశ్చన్‌ చేయడు. సదరు దర్శకుడికి తీయగలననే కన్విక్షన్‌ వున్నట్టయితే ఎంత పెద్ద స్టార్‌ అయినా పదే పదే గుచ్చి గుచ్చి కథలో మార్పుచేర్పులు చేయమనడు.

అమీర్‌ఖాన్‌లాంటి ఏ కొందరో ప్రతి సినిమా విషయంలోను జాగ్రత్త పడతారేమో కానీ దక్షిణాదికి వస్తే దర్శకుడి ట్రాక్‌ రికార్డ్‌ అనుగుణంగా వెళ్లిపోతారు. చిరంజీవి స్థాయి, అనుభవం వున్న వారయితే కాస్త సలహాలు, సంప్రదింపులు చేయవచ్చు కానీ మిగతావాళ్లు దర్శకుడి తీర్పుకే కట్టుబడతారు. దీనిని బట్టి ఒక సినిమా సక్సెస్‌, ఫెయిల్యూర్‌కి పూర్తి బాధ్యుడు దర్శకుడేననేది స్పష్టం. ఒక సినిమా సక్సెస్‌ రేంజ్‌ని హీరో పెంచగలడేమో కానీ ఒక బ్యాడ్‌ సినిమాని ఆడించడం ఏ హీరో తరం కాదు.

హీరో ఓకే అనేసాడు కదా అని ఏదో తూతూ మంత్రంగా కథలు రాసేసుకుని సెట్స్‌ మీదకి వెళ్లకుండా సుకుమార్‌, కొరటాల శివ మాదిరిగా ఒళ్లు దగ్గర పెట్టుకుని స్క్రిప్టు సిద్ధం చేస్తే ఏ సినిమాలూ అజ్ఞాతవాసులు, స్పైడర్‌లు అవ్వవు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు