సూపర్ స్టార్ ప్లేసులో సాయిప‌ల్ల‌వి

సూపర్ స్టార్ ప్లేసులో సాయిప‌ల్ల‌వి

వేస‌విలో సినిమాల పండ‌గే జ‌రుగుతోంది. వ‌రుస‌పెట్టి సినిమాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో థియేట‌ర్లు లేక... విడుద‌ల తేదీలు క్లాష్ అవుతుండ‌డంతో ఏ సినిమా ఎప్పుడొస్తుందో వ‌చ్చే వ‌ర‌కు తెలియ‌డం లేదు. ఇదిగో ఇప్పుడు మ‌రో సినిమాకు ఇలాగే జ‌రిగింది. విడుద‌ల తేదీలు త్వ‌ర‌త్వ‌ర‌గా మారిపోతున్నాయ్‌. కాలా ప్లేసులోకి క‌ణం వ‌చ్చేసింది.

ర‌జినీకాంత్ కాలా ఇదిగో అదిగో అంటూ ఎన్నో విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించారు. కానీ ఇంత‌వ‌ర‌కు విడుద‌ల‌కు నోచుకోలేదు. మొన్న‌టి ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు... ఆ త‌రువాత జూన్ 7కు వాయిదా వేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. అప్పుడేనా విడుద‌ల‌వుతుందో లేదో ఆ చిత్ర బృందానికే తెలియాలి అని కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లో కూడా ఒక‌టే గుస‌గుస‌లు. ఆ సినిమా సంగ‌తి ప‌క్క‌న పెడితే సాయి ప‌ల్ల‌వి నాగ‌శౌర్య క‌ణం సినిమా ద‌గ్గ‌రికి వ‌ద్దాం. ఈ సినిమా మార్చి 3న విడుద‌ల‌వ్వాలి. ఆ స‌మ‌యంలోనే సినీ ఇండ‌స్ట్రీలో డిజిట‌ల్ ప్రొవైడ‌ర్లు నిర్మాత‌ల‌కు మ‌ధ్య బేధాభిప్రాయాలు వ‌చ్చి స్ట్రైక్ చేశారు. దీంతో ఆ సినిమా విడుద‌ల‌వ్వ‌కుండా ఆగి పోయింది.

ఇప్పుడు కాలా సినిమా ఏప్రిల్ 27 విడుద‌ల కాద‌ని తెలిశాక క‌ణం ఆ స్థానంలోకి వ‌చ్చేసింది. ఏప్రిల్ 27నే క‌ణం సినిమా తమిళ తెలుగు భాష‌ల్లో  విడుద‌ల కానుంది. ఇది హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో సాగే సినిమా. త‌మిళంలో కారు పేరుతో విడుద‌ల‌వుతోంది. ఇందులో తొలిసారి సాయి ప‌ల్ల‌వి నాలుగేళ్ల పిల్ల‌కి త‌ల్లిగా న‌టించింది. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో అదే రోజున ఆచారి అమెరికా యాత్రం వంటి సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English