మెగా హీరోల కోసం పొలిటికల్ స్ర్కిప్ట్

మెగా హీరోల కోసం పొలిటికల్ స్ర్కిప్ట్

ఒక‌ప్పుడు తెలుగులో టాప్ డైరెక్ట‌ర్ గా ఓ వెలుగు వెలిగాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి ట్రాక్ లోకి రావాల‌ని చూస్తున్నాడు. అయితే త‌న దైవం కోసం ఓ పొలిటిక‌ల్ డ్రామా క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట పూరీ. ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే బాధ్య‌త‌ను తీసుకున్నాడ‌ట పూరీ. త‌న త‌ర్వాతి సినిమాతో జ‌న‌సేన ఐడియాల‌జీని చెప్పాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఇప్పుడు జ‌న‌సేనాని సినిమాలు మానేయ‌డంతో ఆయ‌న కుటుంబంలోని హీరోతోనే ఈ సినిమా చేయ‌నున్న‌ట్టు రూమ‌ర్ వినిపిస్తోంది.

‘పోకిరి’ సినిమా సంచ‌ల‌న విజ‌యం త‌ర్వాత మ‌ళ్లీ మ‌ళ్లీ అదే ఛాయ‌ల‌తో సినిమాలు తీస్తుండ‌డంతో జ‌నాల‌కు పూరీ సినిమాల‌పై ఆస‌క్తి త‌గ్గింది. హీరోలు ఛాన్సులివ్వ‌డం మానేశారు. మ‌ళ్లీ పూరీ ఫామ్ లోకి వచ్చేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్పుడు పూరీ త‌న కొడుకు ఆకాష్ ను హీరోగా లాంచ్ చేస్తూ ‘మెహ‌బూబా’ సినిమా తీశాడు. ఇండో- పాక్ స‌రిహ‌ద్దులో హిందూ సైనికుడికీ.. ముస్లిం అమ్మాయికి మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌థ‌గా రూపొందుతోందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్ తో త‌న‌లోని క్రియేటివిటీ త‌గ్గ‌లేద‌ని నిరూపించుల‌నుకుంటున్నాడు పూరీ. ఈ సినిమా క‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కొడుతుందని... త‌న‌కి స్టార్ హీరోలు అవ‌కాశ‌మిస్తార‌ని అనుకుంటున్నాడు. ఇప్ప‌టికే మెగా హీరోల కోసం ఓ ప‌వ‌ర్ ఫుల్‌ పొలిటిక‌ల్ డ్రామా క‌థ‌ను రెఢీ చేస్తున్నాడ‌ట పూరీ. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన సిద్ధాంతాల‌ను జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డమే ఈ సినిమా ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు.

ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ గానీ లేక‌పోతే వ‌రుణ్ తేజ్ గానీ హీరోగా న‌టింప‌చేయాల‌ని అనుకుంటున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఇప్పుడు రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే సినిమాల‌కి మంచి రిజ‌ల్ట్ వ‌స్తుండ‌డం... అదీ గాక సార్వ‌త్రిక ఎన్నిక‌లు దగ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో స్ర్కిప్టును సాధ్య‌మైనంత త్వ‌ర‌లో పూర్తి చేసి... మెహ‌బూబా థియేట‌ర్ల‌లోకి రాగానే ఈ చిత్రాన్నిసెట్స్ మీదికి తీసుకెళ్లాల‌ని పూరీ విశ్వ‌ప్ర‌యత్రాలు చేస్తున్నాడ‌ని ఓ రూమ‌ర్ టాలీవుడ్ లో షికారు చేస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మాత్రం కొంత కాలం ఎదురుచూడాల్సిందే!