నాన్-బాహుబలి రికార్డుల్లో భరత్ కూడా..

 నాన్-బాహుబలి రికార్డుల్లో భరత్ కూడా..

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమాపై విడుద‌ల‌కు ముందు ఏ స్థాయిలో అంచ‌నాలు ఉన్నాయో తెలిసింది... హామీ ఇచ్చిన‌ట్టుగానే చెప్పి మ‌రీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాడు సూప‌ర్ స్టార్‌. వ‌సూళ్లు కూడా మ‌హేష్‌ స్థాయికి త‌క్కువ కాకుండా వ‌స్తున్నాయి. కొన్ని చోట్ల అయితే నాన్‌- బాహుబ‌లి రికార్డులు కూడా బ‌ద్ద‌లు కొట్టేసింది ‘భ‌ర‌త్ అనే నేను’.

కృష్ణా- గుంటూరు ఏరియాల్లో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ చాలా ఎక్కువ‌. దానికి త‌గ్గ‌ట్టుగానే కృష్ణాలో తొలిరోజే 1.93 కోట్ల షేర్ సాధించిన మ‌హేష్ బాబు... గుంటూరులో ఏకంగా 4.04 కోట్ల షేర్ రాబ‌ట్టి నాన్‌- బాహుబ‌లి రికార్డు క‌లెక్ష‌న్లు సాధించాడు. మిగిలిన ఏరియాల్లో మాత్రం నాన్‌- బాహుబ‌లి రికార్డులు ఇంకా ప‌దిలంగానే ఉన్నాయి. ఆంధ్రాలో తొలిరోజు 17.56 కోట్ల షేర్ సాధించి టాప్ లో ఉన్నాడు ‘అజ్ఞాత‌వాసి’... వైజాగ్‌-  వెస్ట్‌- నెల్లూరు ఏరియాల్లోనూ ఈ సినిమాదే హ‌వా! ఈస్ట్ లో మాత్రం ‘కాట‌మ‌రాయుడు’ రికార్డు ప‌దిలంగా ఉంది. టోట‌ల్ ఏపీ క‌లెక్ష‌న్ల ప‌రంగా చూసినా  ‘అజ్ఞాత‌వాసి’ సినిమాకి తిరుగే లేదు. 20.91 కోట్ల షేర్ సాధించింది ప‌వ‌న్ చివ‌రి సినిమా. నైజాం న‌వాబ్ నేనే అంటున్నాడు ఎన్‌.టీ.ఆర్‌. ఆయ‌న న‌టించిన  ‘జ‌న‌తా గ్యారేజ్‌’ మొద‌టి రోజు నైజంలో 5.51 కోట్ల షేర్ సాధించి నాన్‌-బాహుబ‌లి రికార్డు సృష్టించింది. సీడెడ్ లోనూ తార‌క్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ‘జై ల‌వ‌కుశ‌’ సీడెడ్ నుంచి 4.28 కోట్లు రాబ‌ట్టి రికార్డు సృష్టించింది.  

ఒక్కో ఏరియాలో ఒక్కో హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంటుంది. నైజాంలో ఎన్‌.టీ.ఆర్ సినిమాల‌కు క్రేజ్ ఉంటే- ఆంధ్రాలో ప‌వ‌న్ కల్యాణ్ కి భారీ ఫాలోయింగ్ ఉంది. కృష్ణా- గుంటూరు మాత్రం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబువే. అయితే తొలిరోజు క‌లెక్ష‌న్లు సినిమాకున్న హైప్ చూపిస్తాయి కానీ  ఫ‌లితాన్ని ప్ర‌భావితం చేయ‌లేవు. కాబ‌ట్టి మొద‌టి వారం క‌లెక్ష‌న్ల ప‌రంగా ఎన్ని రికార్డులు భ‌ర‌త్ ఖాతాలో చేర‌తాయోన‌ని సూప‌ర్ స్టార్ అభిమానులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు