భరత్ సూచనలు చప్పగా ఉన్నాయ్

భరత్ సూచనలు చప్పగా ఉన్నాయ్

ఒక స్టార్ హీరో ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడంటే.. కచ్చితంగా ఏదో కొత్తదనం చూపిస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తాం. అలాంటిది మహేష్ బాబు ఆ పాత్రలో కనిపించనున్నాడంటే.. ఈ హోప్స్ ఇంకా ఎక్కువగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు మహేష్ మూవీ భరత్ అనే నేను థియేటర్లలోకి వచ్చింది.

ఈ సినిమాలో సీఎంగా మహేష్ ప్రమాణ స్వీకారం చేశాక అడ్రస్ చేసే మొదటి ఇష్యూ ట్రాఫిక్. దీనికి కొరటాల అండ్ మహేష్ చూపించిన పరిష్కారం.. నిర్దాక్షిణ్యంగా భారీ ఫైన్స్ విధించడమే. కానీ ఇదేమీ కొత్త విషయం కాదు.. సుప్రీం ఇప్పటికే కళ్లు చెదిరే ఫిగర్స్ ను ఫైన్ విధించాలని సూచించింది. ఇక ప్రభుత్వ పాఠశాలల సమస్య కూడా పెద్ద విషయమే. కాన్వెంట్స్ కు తప్ప గవర్నమెంట్ స్కూల్స్ కు పిల్లలను పంపే పరిస్థితి కనిపించడం లేదన్నది సినిమాలో చూపించిన అంశం. ఇందులో తప్పేమీ లేదు కానీ.. గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి చాలాకాలమే అయింది. ఆ విషయం ప్రస్తావించకుండా.. అదే పరిష్కారం అని చెప్పడం హాస్యాస్పదమే.

ఇక పల్లె ప్రగతి విషయంలో కూడా భరత్ చెప్పిన సలహాలు గొప్పగా ఏమీ ఉండవు. ఆయా గ్రామస్తులే తమకు ఏం కావాలో నిర్ణయించుకోవాలని ముక్తాయింపు ఇస్తారు. ఇప్పుడు ఉన్న పంచాయితీ వ్యవస్థ ఉన్నది అందుకే.. కానీ అది జరగడం లేదు. వ్యవస్థను క్రమబద్దీకరించే గొప్ప సలహాలు అయితే సీఎం మహేష్ ఇవ్వలేకపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు