ఫారిన్ అందాలు సరే.. ఈ సొగసులు భలే

ఫారిన్ అందాలు సరే.. ఈ సొగసులు భలే

బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా చాలామందికి ఓ రోల్ మోడల్. ఒకప్పుడు ఎంతో లావుగా ఉండే ఈ భామ.. ఇప్పుడు సన్నబడిపోయి షాక్ ఇవ్వడమే కాదు.. గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అటు అందంతో పాటు ఇటు ట్యాలెంట్ కూడా చాలా ఉన్న ఈ సుందరికి.. భలే మంచి అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి.

ఒకవైపు సినిమాల్లో సత్తా చాటుతూనే.. మరోవైపు బ్రాండ్ అంబాసిడర్ గాను టాప్ గేర్ లో ఉంది పరిణీతి చోప్రా. ప్రస్తుతం ఈ భామ ఆస్ట్రేలియా టూరిజంకి బ్రాండ్ అంబాసిడర్. ఇండియాలో ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రచార వ్యవహారాలు ఈమెతోనే చేయిస్తారన్న మాట. తన బాధ్యతను బాగానే నిర్వహించేస్తోంది పరిణీతి. ఇందుకు సంబంధించిన యాడ్ తో పాటు పిక్స్ కూడా బోలెడన్ని షేర్ అవుతున్నాయి. వీటన్నిటిలోను ఆస్ట్రేలియా ఖండపు అందాలు.. సముద్ర తీరాలు.. సుందర దృశ్యాలు చాలానే కనిపిస్తున్నాయ్ కానీ.. పరిణీతి కారణంగానే ఓ సమస్య వచ్చి పడింది.

ఈ ఫోటోలలో పరిణీతి బోలెడంత గ్లామర్ గా కనిపించేసింది. దీంతో అందరూ ఆమె అందాలను చూడడమే సరిపోతోంది. ఎదురుగా ముగ్ధమనోహరంగా ఈ వయ్యారి కనిపిస్తుంటే.. కళ్లు అటూ ఇటూ కదిలి ఆస్ట్రేలియా అందాల వైపు మరల్చడం కష్టం అయిపోతోంది. ఓ రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా అందాల కంటే ఈమె సొగసులే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు