ఆమె దగ్గర ఇంకా మూడున్నాయ్!

ఆమె దగ్గర ఇంకా మూడున్నాయ్!

టాలీవుడ్ లో వెలిగిపోయేందుకు మలయాళీ భామ అను ఇమాన్యుయేల్ గట్టిగానే ట్రై చేస్తోంది. ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చినా స్టార్ స్టేటస్ కి మాత్రం ఇంకా చాలా దూరంలో ఉండిపోయింది. టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా స్టార్ స్టేటస్ దక్కితే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే బడా ఛాన్సులను బాగానే ఒడిసిపట్టుకున్నా.. కానీ పాపం ఈ అమ్మడికి ఈ ఏడాది ఆరంభం కలిసిరాలేదు.

పవన్ కళ్యాణ్ తన రేంజ్ ను మార్చేస్తాడని నమ్మకాలు పెట్టుకుంటే.. అజ్ఞాతవాసి కారణంగా అనుకు అంందాల్సిన స్టార్ స్టేటస్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అలాగని ఈమె టాప్ హీరోయిన్ రేసు నుంచి తప్పుకున్నట్లు ఏమీ కాదు. ఎందుకంటే.. ఇప్పుడీ భామ చేతిలో మూడు అవకాశాలు ఉన్నాయి. మూడుకి మూడు క్రేజీ ప్రాజెక్టులే కావడమే హైలైట్. వచ్చే నెల 4న విడుదల కాబోతున్న అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్యపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఆర్మీ బేస్డ్ గా నడిచే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కు ఎంత స్కోప్ ఉందో చెప్పలేం కానీ.. గ్లామర్ యాంగిల్ మాత్రం బాగానే పంచింది అను ఇమాన్యుయేల్.

ఇప్పటికే ఈమె నాగచైతన్య- మారుతి కాంబినేషన్ లో రూపొందుతోన్న శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్ గా నటించేస్తోంది. షూటింగ్ లో కూడా భాగం అయిపోయింది. ఈ చిత్రం ఆగస్ట్ నెల నాటికి విడుదల అయే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతోన్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కూడా ఒక హీరోయిన్ గా నటిస్తోంది అను. మూడు ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో.. తన స్థాయిని పెంచుకునేందుకు అమ్మడికి ఇంకా చాలానే స్కోప్ ఉందని చెప్పవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English